Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కరోనాను కలిసి కట్టుగా ఎదుర్కొందాం | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Apr 06,2020

కరోనాను కలిసి కట్టుగా ఎదుర్కొందాం

కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనాకు మానవులపై కరుణ లేదు. కండ్లకు కనిపించని ఈ వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఒక సూదిమొనపై సుమారు 10కోట్ల కరోనా జీవులు తిష్టవేయవచ్చని నిపుణుల చెపుతున్నారు. దీనిని బట్టి అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయో అంచనా వేయవచ్చు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వైరస్‌ ప్రపంచ మానవాళిని అష్టకష్టాలపాల్జేస్తున్నది. కంటికి కనిపించని ఈ వైరస్‌ ప్రజలపై ఏ రూపంలో దాడి చేస్తోందో చెప్పలేం. మనిషికి మనిషి ఎడం (దూరం) పాటించడమే దీనికి నివారణ అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. కోట్లాది మంది ప్రజలను ఇండ్లకే పరిమితం చేశారు. స్వీయ గృహ నిర్బంధంలో ప్రజలు నివసిస్తున్నారు. మనం నివసిస్తున్నది ఆదిమ కాలం కాదు. సకల శాస్త్ర సాంకేతిక సౌకర్యాలతో ఆధునిక యుగంలో జీవిస్తున్నార. అయినప్పటికీ కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయలేకపోతున్నాం. చైనాలోని వూహాన్‌ నగరంలో జనించిన ఈ వైరస్‌ శరవేగంతో 200 దేశాలకు విస్తరించింది. దీనికి కారణమేమిటి? ప్రపంచంలోని వివిధ దేశాలకు గంటల వ్యవధిలో ప్రయాణించడానికి వాయుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రజలు చాలా వేగంగా విమానాల్లో వెళుతున్నారు. కరోనా వైరస్‌ కూడా అంతే వేగంతో ప్రజలతో పాటే వివిధ దేశాలను చుట్టేసింది. ఆ దేశాలకు చెందిన కొంత మంది ప్రజల దేహాల్లో తిష్టవేసింది. మన దేశంలో కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో మొదట కనిపించాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో పూర్తి శ్రద్ధ వహించింది. 26వేల కోట్ల రూపాయలను కరోనా కట్టడికి కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణలో కరోనా వ్యాధి పీడితుల సంఖ్య పెరగడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఒక ప్రార్థనా మందిరంలో జరిగిన సమావేశానికి హాజరైన వారిలో కరోనా లక్షణాలు కనిపించాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో అతి ఎక్కువగా కరోనా వల్ల నష్టపోయిన దేశం ఇటలీ. ఇటలీకి చైనాలోని వూహాన్‌ నగరానికి అవినాభావ సంబంధముంది. వ్యాపార వాణిజ్య సంబంధాల వల్ల నిత్యం ఈ రెండు దేశాల మధ్య రాకపోకలు సాగేవి. దీని వల్లనే ఇటలీకి కరోనా వ్యాపించింది. చైనా పాలకులు వ్యాధి తీవ్రతను గుర్తించి ఆఘామేఘాలపై ప్రజలను మానసికంగా వ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారు. సైన్యాన్ని రంగంలోకి దింపారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే వేల పడకల ఆస్పత్రిని నిర్మించారు. ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నమోదైన కరోనా కేసులు 11,39,207. మరణాలు 60,874. ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మన దేశంలో ఇప్పటి వరకు 3,0727 కేసులు నమోద కాగా 75మంది మరణించారు. వివిధ దేశాల్లో కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలను మన ప్రభుత్వం సమీక్షించింది. కేంద్ర ఆరోగ్య మండలి సలహా మేరకు మార్చి 22న దేశ వ్యాపిత కర్ఫ్యూను అమలు చేసింది. ఆ తరువాత లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకు పొడిగించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15 వరకు పొడిగించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రానట్లయితే లాక్‌డౌన్‌ మరింత కాలం పొడిగించే అవకాశాలున్నాయి. కరోనా వల్ల ప్రపంచంలో కరచలనాలు బందయ్యాయి. దూరం నుంచే మన ప్రజలు అభివాదం చేసుకునే 'నమస్కారం' విశ్వ ప్రజలకు సంస్కారమైంది. వ్యాధి నివారణకు ఆచరణీయమైంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతనూ పాటించాలి. ఒక వ్యక్తికి మరో వ్యక్తి భౌతిక దూరాన్ని పాటించాలి. అయితే మన దేశంలోని కొంత మంది మత చాందస వాదులు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించడం లేదు. ప్రార్థనా స్థలాల్లో వందల సంఖ్యలో గుమిగూడుతున్నారు. తమకు ఏమి కాదనే అతి విశ్వాసంతో ఉన్నారు. ఈ అతి విశ్వాసమే కొంప ముంచుతుందనే విషయాన్ని వారు గ్రహించడంలేదు. అనేక దేశాల్లో కొంత పాలకుల నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి కారణమైంది. 60 సంవత్సరాలు పైబడిన వారు చిన్న పిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా కరోనా గట్టి దెబ్బ తీసింది. లక్షల కోట్లకు మించి ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతోంది. వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందువల్లనే ఐక్య రాజ్య సమితి దీనిని ప్రపంచ విపత్తుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ప్రపంచంపై పెత్తనం చేస్తున్న అమెరికా పాలకులు ముఖ్యంగా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను ఖాతరు చేయని ఫలితాన్ని ఇప్పుడా దేశం అనుభవిస్తోంది.
కరోనా నివారణలో క్యూబా ఆదర్శం
కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైన వైద్యులను వివిధ దేశాలకు పంపించడం ద్వారా చిన్న దేశం క్యూబా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్‌ నుంచి బయలు దేరిన ఓడను తమ దేశంలోకి అనుమతించడమే కాకుండా కరోనా సోకిన వారికి తమ ఆస్పత్రుల్లో చికిత్సనందించింది. ఆ ఓడలో 682 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకినట్టు గుర్తించారు. కరోనా నివారణ వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చాలా చురుకుగా సాగుతున్నాయి. అమెరికాలో జరుగుతున్న పరిశోధనకు 43ఏండ్ల జెన్నీఫర్‌ అనే మహిళ ముందుకు వచ్చింది. త్వరలోనే వ్యాక్సిన్‌ కనుగొనే అవకాశాలున్నాయి.
కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ వల్ల మన దేశంలో లక్షలాది మంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించే ప్రభుత్వం పేద ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది. కరోనా దేశంలోని లక్షలాది ప్రజలు నిరశ్రయులయ్యారు. ఉపాధి కోల్పోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో నెత్తిన మూటలు, సంకన పిల్లలతో కాలినడకన వందల మైళ్లు ప్రయాణిస్తున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి కేంద్రం ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ సరిపోదని, ఆ నిధులను పెంచాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. ఏది ఏమైనా కరోనాపై కలిసి కట్టుగా యుద్ధం చేయడమే మన ముందున్న కర్తవ్యం. ఆ సమిష్టి యుద్ధమే మనలను మన పిల్లలను కాపాడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

జి.గంగాధర్‌ సిర్ప

సెల్‌: 8919668843


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వ్యాక్సిన్‌ రాజకీయాలు.. మోడీ భక్తుల వక్రీకరణలు
పెరుగుతున్న జాత్యహంకారం
సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
అత్యంత ప్రజాధరణ పొందిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌లు..!
గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!
జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్న రైతాంగం

తాజా వార్తలు

10:15 AM

ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టివేత

10:03 AM

ఒక్క నిమిషం ఆగితే ప్రాణాలు దక్కేవి...

09:42 AM

తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్

09:36 AM

కరీంనగర్‌లో దారుణం...

09:26 AM

టీడీపీ నేత కళా వెంకటరావును విడిచిపెట్టిన పోలీసులు

08:37 AM

సింగ‌రేణి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

08:21 AM

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..కరోనా వ్యాక్సిన్‌ను..!

08:04 AM

నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

07:55 AM

తెలంగాణలో ఒకేరోజు 6,400 కోళ్లు మృతి

07:41 AM

ఓయూ హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

07:34 AM

నేడు రేష‌న్ డోర్ డెలివ‌రీ వాహ‌నాల‌ను ప్రారంభించనున్న జగన్‌

07:19 AM

మాజీ గవర్నర్‌ మాతా ప్రసాద్‌ కన్నుమూత

07:15 AM

వనపర్తి మార్కె‌ట్‌లో ప‌ల్లి‌కి రికార్డు ధ‌ర‌

06:55 AM

పాతబస్తీలో గ్యాస్ సిలిండర్‌ పేలుడు

06:35 AM

పీఆర్సీ కోసం 23న దీక్ష: పెన్షనర్ల జేఏసీ

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.