Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
'ధరల్ని' ఎలా నిర్ణయిస్తారు? | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • May 04,2020

'ధరల్ని' ఎలా నిర్ణయిస్తారు?

11
పని స్థలంలో తయారయ్యే సరుకులకు 'ధరల్ని' ఎలా నిర్ణయిస్తారు? ఇది చూడాలి ఇప్పుడు.
చొక్కా ఉదాహరణలో పెట్టుబడిదారుడు ఒక చొక్కా కోసం సాధనాలుగా ఖర్చు పెట్టినది 80 కదా? పెట్టుబడిదారుడు ఆ 80ని తను పెట్టిన 'పెట్టుబడి'గా అనుకుంటాడు. '80 డబ్బుని పెట్టుబడిగా పెట్టాను' అంటాడు.
'పెట్టుబడి' అంటే 'కొంత డబ్బు'ని నిజానికి పెట్టుబడిగా చూడడం కాదు. 'పని స్థలం'లో పెట్టిన ఉత్పత్తి సాధనాలే 'పెట్టుబడి'. అసలు ఉత్పత్తి సాధనాలను అయినా 'పెట్టుబడి' అనకూడదు.
ఇళ్ళల్లో వంటలు చేసుకునేటప్పుడు ''అన్నం వండడానికి 'పెట్టుబడి' ఎంత? కూరల కోసం పెట్టుబడి ఎంత?'' - అంటామా? ఇళ్ళల్లో తయారయ్యే వంటలు 'అమ్మకం సరుకులు' కావు. కాబట్టి, ఇళ్ళల్లో 'పెట్టుబడి' అనే మాట రాదు. వంటల కోసం బియ్యం కావాలనీ, కూరగాయలు కావాలనీ, ఈ మాటలే వస్తాయి. 'పెట్టుబడి' అనే మాట రాదు. సమాజాన్ని కూడా అలాగే చూడడం అసాధ్యమా?
సరుకుల్ని తయారు చేయించే పెట్టుబడిదారీ విధానంలో 'డబ్బు'నే పెట్టుబడి అనడం ప్రారంభమవుతుంది.
ఆ దుస్తుల 'పరిశ్రమ'లో చొక్కా తయారు కావాలంటే 'పనిస్తలం'లో ఉత్పత్తి సాధనాలు లేకుండా, వాటి విలువ అయిన '80 డబ్బే' వుంటే, కుట్టు శ్రమ కార్మికుడు అక్కడికి వచ్చినా, ఆ డబ్బుతో తన పని మొదలు పెట్ట గలడా?
ఈ పెట్టుబడిదారుడు ఆ 80 డబ్బుని పట్టుకుని, తనకు ప్రస్తుతం కావలిసిన ఉత్పత్తి సాధనాల్ని కొని తీసుకురావాలని, ఇతర పెట్టుబడిదారుల దగ్గిరికి వెళ్తే అక్కడ కూడా ఆ సాధనాలు లేకపోతే ఈ పెట్టుబడిదారుడి చేతిలో ఎంత డబ్బు వున్నా ఏం చేయగలడు? డబ్బు వుంటేనే పనిస్థలంలో ఏ ఉత్పత్తి సాధనాల్ని పెట్టాలో ఆ సాధనాల్ని పెట్టినట్టు అవుతుందా?
'పెట్టుబడి' అంటే, డబ్బు కాదు, ఉత్పత్తి సాధనాలే. పనిస్థలంలో అన్ని సాధనాలు వుండి, కుట్టు మిషన్‌లో 'సూది' ఒక్కటీ లేకపోతే పని మొదలవుతుందా? అంటే, ఒక ఉత్పత్తి తయారవ్వాలంటే కొన్ని సాధనాలు అంత అత్యవసరం.
కొత్త చొక్కా తయారవడానికి పని స్థలంలో (1) 3 రకాల ఉత్పత్తి సాధనాలు, (2) కుట్టు శ్రమ చేసే కార్మికుడు - ఈ రెండూ వుండాలి.
'చొక్కా' గాక మరో ఉత్పత్తి ఏదైనా తయారయ్యే పనిస్థలంలో అయితే? అక్కడైనా ఎక్కడైనా అంతే. - ఆ ఉత్పత్తి తయారీకి అవసరమైన ఉత్పత్తి సాధనాలు, ఆ శ్రమ చేసే మనుషులు, - ఈ రెండూ వుండితీరాలి. చొక్కా కోసం 'ఉత్పత్తి సాధనాల' ఖర్చు వల్ల లెక్కకు వచ్చే శ్రమ 'గత శ్రమ'. ఆ సాధనాల్ని ఉపయోగిస్తూ చేసే కుట్టు శ్రమ 'కొత్త శ్రమ'. ఏ ఉత్పత్తి గానీ, ఏ పదార్థం గానీ తయారవ్వాలంటే, దాని కోసం (1) గత శ్రమ, (2) కొత్త శ్రమ - రెండూ వుండాలి. అవి రెండూ వుంటేనే ఆ ఉత్పత్తి తయారవడం సాధ్యం.
గత శ్రమలు లేని పదార్థాలు వుండవా?
'గత శ్రమ' లేని ఉదాహరణలు కూడా వుంటాయి. అడవుల్లోనూ, కొండల మీదా వుండే కాయలు, పళ్ళు, అడవి జంతువులు, నీళ్ళ మడుగుల్లో చేపలు - వంటి వన్నీ ఏ శ్రమలూ లేకుండా సహజంగా తయారై వున్నవే. అవి కావాలంటే, వాటి కోసం కొన్ని శ్రమలు జరగాలి. చెట్టు ఎక్కి పండుని అందుకో గలిగితే అది కొత్త శ్రమే. ఆ పండు గత శ్రమ లేకుండా కొత్త శ్రమ వల్ల దొరికినట్టే అవుతుంది. అడవిలో తిరిగే ఏదైనా జంతువు దొరికితే, మనుషులు దాన్ని చంపి ఆహారంగా చేసుకుంటే 'గత శ్రమ' లేకుండానే 'సహజ పదార్థం' మీద 'కొత్త శ్రమ' జరిగినట్టు అర్థం.
'మానవ సమాజం'లో అయితే, నేల మీద మట్టీ, కొండల్లో రాళ్ళూ - వంటివి తప్ప, గత శ్రమ లేని సహజ పదార్థాలేవీ వుండవు.
చొక్కా ధర ఎంత?
మనం ఉదాహరణగా తీసుకున్న చొక్కా ధర సంగతి ఇంకా చూడాలి. చొక్కా కోసం ఖర్చయిన ఉత్పత్తి సాధనాల విలువని 80 అనుకున్నాం. ఇంకా చాలా విషయాలు చూడాలి.
(ఆ ఉత్పత్తి సాధనాల్లో కత్తెరా, మిషనూ - వంటి పనిముట్లు వున్నాయి. అవి ఒక్క చొక్కా కోసం ఖర్చయిపోవు. వాటి మొత్తం విలువల సంగతి ఇక్కడ అనవసరం. అంటే 'కుట్టు మిషన్‌'కి వుండే మొత్తం విలువా, పని స్థలానికి వుండే మొత్తం విలువా, కత్తెరకి వుండే మొత్తం విలువా ఈ విషయాలు ఇక్కడ అక్కర లేదు. ఒక చొక్కా తయారీ కోసం, ఆ పనిముట్ల నుంచి ఖర్చయ్యే విలువల భాగాలు మాత్రమే ఇక్కడ అవసరం. ఆ రకంగా ఒక చొక్కా కోసం అవసరమయ్యే 'ఉత్పత్తి సాధనాల' పాత శ్రమ విలువని 80గా అనుకున్నాం. దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి.)
చొక్కా కోసం 'కుట్టు శ్రమ' చేసిన కార్మికుడికి, యజమాని ఇచ్చిన జీతాన్ని 20 అనుకున్నాం. 10 గంటల కుట్టు శ్రమ కోసం, యజమాని నిర్ణయించిన జీతం అది. ఒక చొక్కా తయారీకి పాత శ్రమా, కొత్త శ్రమా కలిసి 100 అవుతుంది. కాబట్టి, చొక్కా ధర 100 అవుతుందా? ఈ చొక్కాని 100 ధరతో అమ్మితే చొక్కా వెళ్ళిపోయి 100 డబ్బు పెట్టుబడిదారుడి చేతికి వస్తుంది. ఆ మర్నాడు, ఇంకో కొత్త చొక్కాని తయారు చేయించడానికి ఆ 100 డబ్బు సరిపోతుంది.
చొక్కా 'ధర' 100 మాత్రమే అయితే, చొక్కాని అలా అమ్మడం వల్ల పెట్టుబడిదారుడికి ఏం మిగులుతుంది?
పెట్టుబడిదారుడికి అసలు ఎందుకు మిగలాలి? పెట్టుబడిదారుడు అసలు తన 'పరిశ్రమ'ని ఎందుకు పెడతాడు? సరుకుల్ని తయారు చేయించి అమ్మడం వల్ల తనకు కొంత డబ్బు మిగలాలనే కదా? మరి, ఒక చొక్కా తయారీ కోసం 100ని ఖర్చు పెట్టి, ఆ సరుకుని 100కే అమ్మితే పెట్టుబడిదారుడికి ఏమీ మిగలదు కదా?
ఒక ప్రశ్న: చొక్కాని కుట్టడానికి కార్మికుడు 10 గంటలు శ్రమ చేశాడు. ఆ శ్రమ కోసం అతనికి 20 జీతం వచ్చింది. ఆ 10 గంటల కుట్టు శ్రమకి విలువని 20 గా అనుకోవాలా?
పెట్టుబడిదారుడి దగ్గిర అనేక మంది కార్మికులు అనేక రకాల శ్రమలు చేస్తూ వుంటారు. ఆ శ్రమలకు ఎంతెంత విలువలు వుంటాయో కార్మికులకూ తెలీదు. యజమానికీ తెలీదు. కార్మికులైతే తమ శ్రమకి ఎంత విలువ వుంటుందో తెలీదు కాబట్టి, యజమాని ఎంత ఇస్తే అంత తోటే సరిపెట్టు కుంటారు.
పెట్టుబడిదారుడి సంగతే సరిగా తెలుసు కోవాలి. ఒక చొక్కా తయారీ కోసం 100 డబ్బు పెట్టాడంటే, ఆ సరుకుకి ఆ '100 ధరే' పెడతాడా? - అలా పెట్టడు.
బానిస యజమానుల కాలంలో, బానిసలు చేసే ఉత్పత్తులు అనేక రకాలు కావు. అవి కొన్ని రకాలే. వ్యవసాయాలు, చేతి కుట్టు, వడ్రంగం వంటివీ, - అలా కొన్ని మాత్రమే. 'గనుల' తవ్వకాల వంటి శ్రమలు వున్నా, అవి బానిసత్వం ఏర్పడిన ప్రారంభ కాలంలోనే వున్నవి కావు. బానిసలు చేసే కొన్ని రకాల ఉత్పత్తుల్లో నుంచి యజమానులు అన్నిటినీ అమ్మి వెయ్యడం జరగదు. ఆ ఉత్పత్తుల్లో నించి కొన్నింటిని మాత్రమే అమ్మి, మిగతా వాటిని ఆ యజమాని కుటుంబమే వాడుకోవడం జరిగేది.
భూమిని 'కౌలు'కి ఇచ్చే పద్ధతి ఇంకా లేదు కాబట్టి, వ్యవసాయాలన్నీ బానిసలే చేస్తే పంటలన్నీ యజమానులవే.
ఆ కాలంలోనే 'వడ్డీ' పద్ధతి వుంది. బానిస యజమానుల మధ్యనే ఉత్పత్తుల్ని అప్పులుగా తీసుకోవడమూ, అప్పుల్ని తీర్చేటప్పుడు కొంత ఎక్కువ ఉత్పత్తిని కలిపి దాన్ని వడ్డీగా ఇవ్వడమూ మొదలైంది.
బానిసత్వం కొన్ని ప్రాంతాల్లో వేల సంవత్సరాలు సాగిన తర్వాత, బానిసల పోరాటాల వల్ల బానిసత్వం 'కౌలు రైతు విధానం'గా మారింది. ఈ కాలంలోనే 'భూమి కౌలు' అనే మాట ప్రారంభమైంది. బానిసలే కౌలు రైతులు. వాళ్ళు చేయవలిసిన శ్రమలు, గత కాలంలో చేసే రకం శ్రమలే. బానిసల్ని యజమానులు తమ ఇష్ట ప్రకారం సంతల్లో అమ్మే, కొనే, చంపే పద్ధతులు కొంత మారాయి. బానిస యజమానులే భూస్వాములు. 'బానిసత్వం పోవడం' అంటే ఇదే.
'కౌలు పద్ధతి' కాలంలో కూడా 'అమ్మకం' కోసమే సరుకుల్ని తయారు చేసే పద్ధతి అంతగా లేదు. 'కౌలు'ని 'డబ్బు' రూపంలో చెల్లించడం క్రమంగా మొదలైనప్పుడే కౌలు రైతులు, తాము చేసిన ఉత్పత్తుల్ని కొన్నింటిని 'డబ్బు' కోసం అమ్మ వలిసి వచ్చేది.
(ఇంకా వుంది)
రంగనాయకమ్మ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వ్యాక్సిన్‌ రాజకీయాలు.. మోడీ భక్తుల వక్రీకరణలు
పెరుగుతున్న జాత్యహంకారం
సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
అత్యంత ప్రజాధరణ పొందిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌లు..!
గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!
జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్న రైతాంగం

తాజా వార్తలు

09:26 AM

టీడీపీ నేత కళా వెంకటరావును విడిచిపెట్టిన పోలీసులు

08:37 AM

సింగ‌రేణి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

08:21 AM

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..కరోనా వ్యాక్సిన్‌ను..!

08:04 AM

నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

07:55 AM

తెలంగాణలో ఒకేరోజు 6,400 కోళ్లు మృతి

07:41 AM

ఓయూ హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

07:34 AM

నేడు రేష‌న్ డోర్ డెలివ‌రీ వాహ‌నాల‌ను ప్రారంభించనున్న జగన్‌

07:19 AM

మాజీ గవర్నర్‌ మాతా ప్రసాద్‌ కన్నుమూత

07:15 AM

వనపర్తి మార్కె‌ట్‌లో ప‌ల్లి‌కి రికార్డు ధ‌ర‌

06:55 AM

పాతబస్తీలో గ్యాస్ సిలిండర్‌ పేలుడు

06:35 AM

పీఆర్సీ కోసం 23న దీక్ష: పెన్షనర్ల జేఏసీ

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.