Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కరోనా శకంలో కార్మికవర్గం | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • May 18,2020

కరోనా శకంలో కార్మికవర్గం

ఇంతవరకు మనం కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తుశకం అని వ్యవహరిస్తున్నాం. రాబోయే రోజులలో కరోనా పూర్వం, కరోనానంతరం అని మాట్లాడు కోవాల్సి వస్తుందేమో! ఎందు కంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా సష్టించిన విలయ విధ్వంసం అంతగావుంది. ఆర్థికంగా, సైనికపరంగా, సాంకేతికంగా అగ్రరాజ్యాలుగా విలసిల్లు తున్న పాశ్చ్యాత్య దేశాలు తల్లకిందులై పోయాయి. కరోనా నుంచి తమ ఆర్ధిక వ్యవస్థలను, ప్రజల ప్రాణాలను కాపాడుకోలేక తల్లడిల్లి పోతున్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవన శైలి పూర్వం లాగా ఉండబోదని అందరికి అర్థమవుతోంది. అయితే ఈ కరోనా సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు వివిధ ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. మన దేశంలో కరోనా విపత్తు నివారణకు ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిందని, దాన్ని గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, దేశ ప్రజలంతా సహకరించాలని ప్రభుత్వాలు చెబుతు న్నాయి. కానీ వాస్తవమేమిటంటే కరోనా సాకుతో, దేశం లోని బడాపెట్టుబడి దారులకు మరింత దోచిపెట్టడానికి అప్రజాస్వామికంగా, నిరంకుశం చర్యలకు తెరతీస్తున్నా యి. ప్రధానంగా కార్మికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకు వస్తున్న చట్టపర మార్పులు వారిని శాశ్వతంగా బానిసత్వానికి నెట్టేసేలాగున్నాయి. అందుకేకరోనా శకం లో కార్మికవర్గం పరిస్థితి ఎలాఉండబోతోంది అనేది మన కున్న ఆధారాలతో ముందుగానే అంచనా వేసుకోవాలి. రాబోయే కాలంలో ఎదురవ్వ బోయే సవాళ్ళను ఎదుర్కో వడానికి కార్మికవర్గం ఇప్పడినుండే సమాయత్తం కావాలి.
బీజేపీ అధికారంలో వున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదానికి పంపిన ''ఉత్తరప్రదేశ్‌, నిర్దేశిత కార్మిక చట్టాలనుంచి తాత్కాలిక మినహాయింపు ఆర్డినెన్సు-2020''ను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో భారత కార్మిక వర్గం ఎటువంటి దాడిని ఎదుర్కో వాల్సి వస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆర్డినెన్సు ప్రకారం కార్మిక యూనియన్‌లు, కార్మికుల పని పరిస్థితులు, పనిలో వచ్చే సమస్యలు సంబంధిత చట్టా లన్నీ తాత్కాలికంగా మూడేండ్ల పాటు రద్దు చేయ బడుతాయి. కరోనా నివారణకు ప్రకటించిన లాక్‌డౌన్‌ వల్ల మందగించిన ఆర్థిక వ్యవ స్థను గాడిలోపెట్టడానికి కొత్త పరిశ్రమలను ఆకర్షించడా నికి, ఉన్నవాటిని ప్రోత్సహించడానికి ఈ ఆర్డినెన్సు తెస్తున్నామని ఆ ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా పనిగంటలు 8గంటల నుంచి 12గంటలకు పెంచుతూ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు మార్గదర్శకాలు విడుదల చేసాయి. వేరే రాష్ట్రాలు కూడా అదే బాట పడతాయ నడంలో సందేహం లేదు. స్వాతంత్ర పూర్వం అప్పుడే ప్రారంభమైన పరిశ్రమలలో యజమానులు, కార్మికులను బానిసల లాగా పనిచేయిస్తూ అమానుష దోపిడీకి గురి చేస్తున్న సమయంలో, తొలితరం నాయకులు, కమ్మూనిస్టు పార్టీల పోరాటాలు, కృషివల్ల బ్రిటిష్‌ హయాంలో కార్మికుల రక్షణ కోసం కొన్ని చట్టాలు చేయబడ్డాయి. స్వాతంత్రం అనంతరం కూడా వాటిలో కొన్ని మార్పులతో కొనసాగించ బడుతున్నాయి. బలమైన యాజమాన్యాలను పేదలు, నిస్సహాయులైన కార్మికులు ఎదుర్కోలేరు కాబట్టే ఈ చట్టాల ద్వారా కార్మికులకు ప్రభుత్వ యంత్రాంగం, కోర్టులు రక్షణ కల్పించాలని అవి పేర్కొన్నాయి. ఇన్ని చట్టా లున్నప్పటికీ అవి అమలులో విఫలమవుతున్న దృష్టాం తాలు కోకొల్లలు. ఇక యూపీ తరహా ఆర్డినెన్సు అమలులోకి వస్తే మన దేశ కార్మికులు 'ఆధునిక బానిసలుగా' మారుతారనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని కార్మిక చట్టాలను క్రోడీకరించి 4కోడ్‌లుగా మార్చే పనిలో బిజిగా ఉంది. ఇక పనిగంటల పెంపుకూడా ఇలాంటి నిరంకుశ చర్యనే! ఐఎల్‌ఓ నిర్దేశకాలను కూడా వ్యతిరేకం. ప్రస్తుతం ఎనిమిది గంటల పని, ఎనిమిదిగంటల విశ్రాంతి, ఎనిమిదిగంటల స్వంత పనులకు వినియోగించుకునేలా రూపొందించ బడింది. ఆధునిక యంత్రాలు వచ్చిన నేపథ్యంలో కార్మికుల పని గంటలు తగ్గించాలనే డిమాండు కూడా ఉంది. దాని బదులు ప్రభుత్వాలు 12గంటల పనిదినాన్ని ప్రోత్సహి స్తున్నాయంటే అవి పెట్టుబడి దారులపక్షం వహిస్తున్నా యని అర్థం అవుతోంది. ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ పరిమిత రక్షణ కలిపించే కార్మికచట్టాలు కూడా శ్రామికశక్తిలో మెజారిటీగా వున్న అసంఘటిత రంగ కార్మికులకు అమలవడం ఎప్పుడో మానేశాయి. యాజమాన్యాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్సు రంగంలోనూ, ప్రభుత్వరంగ సంస్థలు, ఆయిల్‌ సెక్టార్‌ మొదలైన సంస్థలలో యూనియన్‌లు బలంగా, కార్మికుల పక్షాన్న ఉన్న చోటనే అమలవుతున్నాయి. వాటిల్లో కూడా కాంట్రాక్టు కార్మికుల, తాత్కాలిక, దినసరి కూలీల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు ఈ బలహీనమైన చట్టాల రద్దుకు పట్టు పట్టడంలో కారణ మేమిటి!? రాబోయే కాలంలో ఈమిగిలిన ప్రభుత్వ రంగాన్ని కూడా ప్రయి వేట్‌పరం చేసే ఎత్తుగడలో ప్రభుత్వం ఉంది. మన ప్రధాని ఏనాడో ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రభుత్వరంగం ఉన్నదే ప్రయివేట్‌పరం చేయడానికి లేదా మూసివేయడానికి అని అన్నారు. ఇప్ప టికి అవి బతికున్నాయంటే వాటిలోని చైతన్యవంతమైన కార్మికవర్గం, బలమైన యూనియన్లు ఉండడం వల్లనే! మిగిలిన ఈసంఘటితరంగాన్ని కూడా ప్రయివేట్‌పరం చేసి, వున్న కార్మిక చట్టాలు ఎత్తివేస్తే పెట్టుబడి దారులు అడ్డుఅదుపు లేకుండా కార్మికులను దోచుకోవచ్చని ఉవ్వి ళ్లూరుతున్నారు. ఇప్పుడు కరోనా రావడం, పెట్టుబడిదారు లకు, వాటికి ఊడిగం చేసే ప్రభుత్వాలకు తమ నిరంకుశ చర్యలు అమలు చేయడానికి ఒక సాకుగా దొరికింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరి ఎన్నోమార్లు బయటపడింది. అధికారంలోని టీఆర్‌ఎస్‌ అధినేతకు ప్రశ్నించే ట్రేడ్‌ యూనియన్‌ లంటే అసలు గిట్టదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను నిరంకుశంగా అదుపుచేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల చట్టబద్ద్ద సమ్మెతో ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో మనం కండ్లారా చూసాం. మన రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖా మంత్రి ఈ కరోనా విపత్తు మధ్యలోనే 'ఈస్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ 'కోసం కాలం చెల్లిన చట్టాలను మార్చాలని, చైనా కంపెనీలను ఇండియా తీసుకు రావా లని, కేంద్ర మంత్రికి లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టమనే దాని పరమార్థం. వాస్తవానికి ఈ కరోనా వల్ల తీవ్రంగా నష్ట పోయింది కార్మికులు, సామాన్య రైతాంగం, ఉద్యోగులు, పేదసాదలు. బడా పెట్టుబడిదారులు కోటాను కోట్లతో సిరిసంపదలతో తులతూగుతున్నారు. ప్రపంచంలో ధని కుల జాబితాలు తయారుచేసే ఫోర్బ్‌ ప్రకారం 2020లో కూడా రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రూ.2.7లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వరసగా డి మార్ట్‌ అధినేత 1.3లక్షల కోట్లు, శివనాడార్‌ 89,250కోట్లు, ఉదరు కోటక్‌ 78వేల కోట్లు, గౌతమ్‌ అదానీ 66,700 కోట్ల సంపదతో ఉన్నారు. వీరు కాక మరో ఆరు మంది మొదటి పది మంది బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో ధనికుల మీద పన్ను విధించి పేదలను ఆదుకోవాలని లేఖ రాసిన ఐఆర్‌ఎస్‌ అధికారులమీద క్రమశిక్షణా చర్యలకు కేంద్రం సిద్ధపడిందంటే, ఈ ప్రభుత్వాలు ధనికుల పక్షమే అని తేట తెల్లం కావడం లేదా! దానికి బదులు దేశంలోని 14రాష్ట్రాల ప్రభుత్వో ద్యోగుల జీతాలు కోత పెట్టబడ్డాయి. కేంద్ర ప్రభుత్వోద్యో గుల కరువుభత్యం స్తంభింపచేయబడింది. కోట్లాది ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. 'సందట్లో సడే మియా' అన్నట్టు పరిశ్రమాధిపతు లు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని ఎలా చేయించుకోవాలని పథకాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. వలస కూలీలకు జీతాలు కూడా ఇవ్వకుండా పిల్లాపాపల తో సహా మెడపట్టి బయటకు నెట్టివేశారు. అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల (నియంత్రణ, పని నియమాలు) చట్టం-1979 ప్రకారం అది అక్రమం అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యా లను పల్లెత్తు మాటనలేదు. అసలు లాక్‌డౌన్‌ ప్రకిటించినప్పుడు కోట్లాది మంది వలస కార్మికుల పరిరక్షణ పట్టించుకోవాలని సోయే కేంద్రానికి లేదు. ఫలితంగా లక్షలాదిమంది కాలినడకన స్వస్థలాలకు పోవలసిన మహావిషాదం సంభవించింది. ప్రభుత్వోద్యు గులు, కార్మికుల జీతాలతో కోతలు పెట్టె ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు మాత్రం దాదాపు 68,000కోట్ల బ్యాం కు రుణాలు రద్దు చేసింది. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు అవిఏరాజకీయ పార్టీలకు చెందినప్పటికీ, మౌలికం గా పెట్టుబడిదారులు, భూస్వాముల ప్రయోజనాలను కాపాడడానికే అంకితమై ఉన్నాయని స్పష్టమవుతోంది.
కార్మికవర్గ హక్కుల మీద, ఉద్యోగ భద్రత మీద ప్రారంభమైన ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టడానికి కార్మికవర్గం సన్నద్ధం కావాలి. ముఖ్యంగా సంఘటిత రంగంలోని కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇండిస్టీ ఉద్యోగులు తాము కూడా ప్రమాదంలో ఉన్నామని గ్రహించాలి. మొత్తం కార్మిక శక్తిలో స్వల్పంగా వున్న సంఘటిత రంగం, విడిగా పోరాడితే ఈ బలమైన ప్రభుత్వ దాడిని నిలవరించలేదు. కాబట్టి మెజారిటీగా వున్న అసంఘటితరంగ కార్మికులను కూడా చైతన్య పరిచి ఐక్యపోరాటంలోకి తీసుకు రావాలి. అప్పుడే పెట్టుబడి దారి వర్గాన్ని ఎదుర్కొని కార్మికుల హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోగలరు.
సత్యభాస్కర్‌
సెల్‌:9848391638


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వ్యాక్సిన్‌ రాజకీయాలు.. మోడీ భక్తుల వక్రీకరణలు
పెరుగుతున్న జాత్యహంకారం
సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
అత్యంత ప్రజాధరణ పొందిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌లు..!
గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!
జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్న రైతాంగం

తాజా వార్తలు

10:15 AM

ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టివేత

10:03 AM

ఒక్క నిమిషం ఆగితే ప్రాణాలు దక్కేవి...

09:42 AM

తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్

09:36 AM

కరీంనగర్‌లో దారుణం...

09:26 AM

టీడీపీ నేత కళా వెంకటరావును విడిచిపెట్టిన పోలీసులు

08:37 AM

సింగ‌రేణి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

08:21 AM

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..కరోనా వ్యాక్సిన్‌ను..!

08:04 AM

నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

07:55 AM

తెలంగాణలో ఒకేరోజు 6,400 కోళ్లు మృతి

07:41 AM

ఓయూ హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

07:34 AM

నేడు రేష‌న్ డోర్ డెలివ‌రీ వాహ‌నాల‌ను ప్రారంభించనున్న జగన్‌

07:19 AM

మాజీ గవర్నర్‌ మాతా ప్రసాద్‌ కన్నుమూత

07:15 AM

వనపర్తి మార్కె‌ట్‌లో ప‌ల్లి‌కి రికార్డు ధ‌ర‌

06:55 AM

పాతబస్తీలో గ్యాస్ సిలిండర్‌ పేలుడు

06:35 AM

పీఆర్సీ కోసం 23న దీక్ష: పెన్షనర్ల జేఏసీ

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.