Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వీఆర్‌ఏ ఇసుక దందా ! | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

వీఆర్‌ఏ ఇసుక దందా !

- తహసీల్దార్‌ అనుమతి లేకుండా ట్రాక్టర్‌ యాజమానులతో దందా..
- ఒక్క రోజే వందల ట్రిప్పుల అక్రమ రవాణా !
- కమలాపరం, మంగపేటలో డంప్‌
నవతెలంగాణ-మంగపేట
రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ విధుల్లో లేని రోజులను ఆసరా చేసుకుని ఓ వీఆర్‌ఏ మండలంలోని ఇసుక సిండికేటుతో చేతులు కలిపి మంగపేట గౌరారం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు ఇసుక సిండికేటు ట్రాక్టర్‌ యజమానులకు సహాకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మండలంలోని మిర్చీ రైతులకు కల్లాల్లో ఇసుకను ఉచితంగా తోలుకునేందుకు తహసీల్దార్‌ అనుమతించారు. కొన్ని రోజులుగా స్వంత ట్రాక్టర్లున్న రైతులు ఇసుక తోలు కుంటుండగా ట్రాక్టర్లు లేని రైతులు సిండికేటు ట్రాక్టర్‌ యజమానులను సంప్రదిస్తున్నారు. దీంతో రైతు పేరుతో పది ట్రాక్టర్లు తోలి మరో పది ట్రాక్టర్లను ఎలాంటి డీడీలు లేకుండా కమర్షియల్‌ పనులకు, ప్రైవేటు ఇండ్ల నిర్మాణాలకు, సిమెంట్‌ ఇటుక తయారీ యజమానులకు తోలుతూ సిండికేట్లు క్యాష్‌ చేసుకుంటు న్నారు. ఇసుక సిండికేటు ట్రాక్టర్‌ యజమానులకు వీఆర్‌ఏ సహాకరించడంతోనే సిండికేటు యజమానులు ఇసుకను యదేశ్చగా గౌరాంవాగును తోడేస్తున్నరనే ఆరోపణలున్నాయి. ఒక ట్రాక్టర్‌ ఇసుకకు ప్రభుత్వానికి రూ.954 డీడీ తీసి ప్రయివేటు వ్యక్తులకు తోలితే మండలంలోని దూరాన్ని బట్టి రూ.2 వేల నుండి రూ.25 వందలు యజమానులు తీసుకుంటున్నారు. కాగా పత్రికల్లో వస్తున్న వరుస కథనాలతో తహసీల్దార్‌ బాబ్జీ ప్రసాద్‌ కేవలం రైతులకు మాత్రమే పట్టా బుక్కులపై ఉచితంగా కల్లాలకు ఇసుక తోలుకు నేందుకు వెసులుబాటు కల్పించారు. దీంతో ఇసుక సిండికేటు ట్రాక్టర్‌ యజమానులు కొన్ని రోజులుగా తహసీల్దార్‌ విధుల్లో ఉండగా గౌరారం వాగు వంక చూడలేదు. మిర్చీ రైతులను ఆసరా చేసుకున్న ఇసుక సిండికేటు ట్రాక్టర్‌ యజమానులు వీఆర్‌ఏను మచ్చిక చేసుకుని కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. రైతుల పేరుతో ధరఖాస్తు చేస్తూ వారి అవసరాల మేరకు 5 నుండి 10 ట్రాక్టర్ల ఇసుకను వారికి తోలి మధ్యలో మరో 20 ట్రిప్పులు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి డీడీలు ప్రభుత్వానికి చెల్లించకుండా దందాను యదేశ్చగా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బుధవారం స్థానిక తహసీల్దార్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో మీటింగ్‌ కు వెళ్లగా ఉదయం నుండి వందల ట్రిప్పులు ఇసుకను యదేశ్చగా మండలంలోని మంగపేట, కమలాపురంలలో పలు చోట్ల డంప్‌ చేశారు. తహసీల్దార్‌ లేకుండా ఇసుక ఎలా తోలుతున్నారనే అనుమానంతో వేబిల్‌ చూడగా 2021 జనవరి 9న తీసుకున్న దాన్ని చూపి వీఆర్‌ఏ తోలుకోమన్నాడంటూ సమాధానమిస్తున్న పరిస్థితి. కమలాపురంలోని ఓ వాడలో సీసీ రోడ్డు కొరకు మండల కేంద్రంలోని గౌరారంవాగు నుంచి 2 ట్రిప్పులకు మాత్రమే డీడీ తీయగా తహసీల్దార్‌ అనుమతించారు. ఆ వేబిల్‌ తో అప్పుడే ఇసుక తోలుకున్న కాంట్రాక్టర్‌ తాజాగా బుధవారం అదే వేబిల్లుతో మండల కేంద్రానికి చెందిన ఓ సిండికేటు ట్రాక్టర్‌ యజమానికి చెందిన 2 ట్రాక్టర్లతో సుమారు 50 ట్రిప్పులకు పైగా ఇసుకను పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ప్రధాన రహదారిపై డంప్‌ చేశారు. మండలంలో జరుగుతున్న ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి ఇసుకాసురుల భరతం పట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వామపక్షాలు పుంజుకోవాలి
టీఆర్‌ఎస్‌ మంత్రాంగం
ఉద్యమ నేపథ్యమున్న మహిళగా గుర్తించండి
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటాలి
కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు
బహుభాషా కోవిదురాలు జెడ్పీటీసీ డాక్టర్‌ పిట్టల శ్రీలత
కాళేశ్వరం ఇసుక క్వారీల్లో 'జేసీబీ బకెట్‌' దందా !
కలెక్టరేట్‌లో కాంగ్రెస్‌ ప్రచారం
వాడీవేడీగా పీఏసీఎస్‌ సమావేశం
టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి
పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి
మిషన్‌ భగిరథ పైపు లైన్‌ లీకేజీ
రికార్డులు పూర్తి చేస్తేనే బిల్లులు చెల్లించాలి : కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య
ఈ నెల చివరిలోగా పనులు పూర్తి చేయాలి : పమేలా సత్పతి
అరాచక పాలనకు చరమగీతం పాడాలి : కాంగ్రెస్‌
ఉద్యోగ కల్పనపై 'పల్లా' అబద్ధాలు
బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి
మిర్చి రైతులకు శిక్షణా కార్యక్రమాలు
కొరగుట్టపై అదనపు కలెక్టర్‌ విచారణ
కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించండి
కూలీలు జరభద్రం...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం
రాజాసింగ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలి
రాములునాయక్‌ను గెలిపించాలి
ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసుల ఉక్కు పాదం
ప్రశ్నించే గొంతును గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలి
అన్నారం షరీఫ్‌ దర్గాలో భారీ పోలీసు బందోబస్తు
ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయించాలి

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.