Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 15మందికి సెకండ్ సెషన్ జెడ్జీ గురువారం జైలు శిక్ష విధించినట్టు వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్‌కుమార్ గురువారం తెలిపారు. వరంగల్ ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ పరిధి ప్రధాన కూడలిలో వారం రోజులుగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వరంగల్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన భానోత్ యాకుబ్, ఎస్ సతీష్, ఐ యాకాంబరం, బి రంజిత్, ఎస్ అంజయ్య, హరిరం, కె కుమారస్వామి, కవటి ఎల్లయ్య, బి సరయ్య, పి సురేష్, కె రణదీప్, బి బాబు, ఉడుత రాజు, ఎండీ వలిమియ, పి నవీన్ కుమార్‌ను కోర్టులో హాజరుపరచారు. ప్రతి ఒక్కరికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. అలాగే మరో 35 మందికి రూ.46,400 జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు.