Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-భూపాలపల్లి
కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం స్థానిక ఇల్లందు క్లబ్ హౌస్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. సంవత్సరాల తరబడి ఆర్డిఓ, జేసీ, హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధ కేసులను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో పూర్తి వివరాలను సేకరించి కంప్యూటర్‌లో పొందుపర్చాలన్నారు. 70ఏండ్లుగా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల వివరాలు, ప్రస్తుతం ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న భూమి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూ వివరాలు సేకరించాలన్నారు. తద్వారా ప్రభుత్వ భూములు అన్యా క్రాంతమవ్వకుండా చూడొచ్చన్నారు. రెవెన్యూ రికార్డులను జాగ్రత్తగా పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ల్గొన్నారు.