Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
కస్తూర్బా గాంధీ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో భోజన విరామ సమయంలో గురువారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రావు మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, హాస్టల్ కేర్ టేకర్‌లను నియమించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పీఈటీ పోస్టులను పీడీలుగా ఉన్నతీకరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ మండల అధ్యక్షుడు రాములు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు వీరమల్ల బాబయ్య, మండల కార్యదర్శులు గుగులోతు బలరాం నాయక్, అశోక్ కుమార్, మండల బాధ్యులు పోతుగంటి నర్సయ్య, తమ్మి మధు, నాగయ్య, కేజీబీవీ ఉద్యోగ సిబ్బంది హైమావతి, శైలజ, సుప్రియ, నిర్మల, వనిత, మమత, ఆశ్లేష, సుస్మిత, సంధ్య, లలిత, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : జిల్లా కేంద్రంలోని స్కూల్‌లో మధ్యాహ్న భోజన సమయంలో రెండ్రోజులుగా యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆ ఫెడరేషన్ మండల మహిళా కార్యదర్శి రమణి మాట్లాడారు.కార్యక్రమంలో ఫెడరేషన్ మండల కోశాధికారి సునీల్ కుమార్, టీచర్లు రాజేశ్వరి, పుష్పలీల, జీవన ప్రియ, అనిత, తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని కేజీబీవీ పాఠశాల ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కోశాధికారి కాకా నర్సయ్య, ఉపాధ్యక్షులు శ్రీలత, కార్యదర్శి వనజ, సుమలత, స్పెషల్ ఆఫీసర్ మేడ వసంత, ఉపాధ్యాయులు శ్రీలత, రాణి, విజయ, సునీత, తదితరులు పాల్గొన్నారు.