Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాములు
- కార్మిక, కర్షక పోరు జీపు యాత్ర
నవతెలంగాణ-తొర్రూరు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతి రేక చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో కార్మిక, కర్షక పోరు జీపు యాత్ర గురువారం కొనసాగింది.
తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని అన్నారం రోడ్డు దగ్గర జీపు యాత్ర రథసారథి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాములు మాట్లాడారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ఆమో దించిందని విమర్శించారు. ప్రజల, కార్మికల హక్కులను హరించిదని ఆందోళన వెలి బుచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయకపోగా హాని చేసేలా చట్టాలను మూజు వాణి ఓటుతో ఆమోదించిందని ధ్వజమెత్తారు. 64 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, అధ్యక్షుడు కుంట ఉపేందర్, నాయకుడు రాగుల రమేష్, నాయ కులు బొల్లం అశోక్, యాకూబ్, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము దేవేందర్, మండల అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సయ్య, నాయకులు జమ్ముల శ్రీను, మార్క సాంబయ్య, వెంకన్న, బాబు, రమేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో జీపు యాత్ర చేరుకోగా సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబుగౌడ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు, రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లా డారు. జీపు యాత్రకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మెన్ వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షుడు ఐలయ్య ఆధ్వర్యంలోని బృందాలు సంఘీభావం తెలిపాయి. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు, సీఐటీయూ మండల మాజీ కార్యదర్శి ఇసంపెల్లి సైదులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రణరు, అంగన్‌వాడీ హెల్పర్స్ యూనియన్ నాయకులు వెంకటలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండల కేంద్రంలోని అంగడి సెంటర్‌లో సీఐటీయూ మండల కార్యదర్శి తాడబొయిన శ్రీశైలం, మండల అధ్యక్షులు జిల్లే జయరాజ్ ఆధ్వర్యంలో జీపు యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతాను ఉద్ధేశించి రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు, రాష్ట్ర నాయకుడు రాగుల రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంట ఉపేందర్, ఆకుల రాజు, సీనియర్ నాయకులు మార్తినేని పాపారావు, ఏనుగా సూరారెడ్డి, ముదురుకోల సారయ్య, పాషా, వెంకన్న, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.