Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీ ప్రభుత్వాలు చేస్తున్న మంచి చెడులను గ్రాడ్యుయేట్ ఓటర్లు విశ్లేషించుకోవాలని పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం కోసం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో దేశాయిపేట రోడ్డులోని సీకేఎం కళాశాల మైదా నంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, తది తర పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలపాల న్నారు. రైల్వే ప్లాట్‌ఫారంపై చారు అమ్మిన అని చెప్పే మోడీ ఇప్పుడు రైళ్లను, ప్లాట్‌ఫారాలను అమ్ముతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ అదానీ, అంబానీలకు మేలు చేస్తున్నారని మండిపడ్డారు. 152 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే అందులో రాష్ట్రానికి ఒక్కటి కూడా అందించలేదని చెప్పారు. పన్నుల రూపంలో కేంద్రానికి 2.72లక్షలు కడితే తిరిగి ఇచ్చింది కేవలం 1.50 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమస్యలపై ప్రశ్నించి పరిష్కరించే నేత అని తెలిపారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరో అతిథి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భాం, అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడ్డది టీఆర్‌ఎస్ మాత్రమేనని చెప్పారు. అదే ఉద్యమ స్ఫూర్తితో అభివద్ధి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివద్ధి కోసం పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లక్షా 32 వేల 899 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. అలాగే ప్రయివేట్ రంగంలో 14 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని చెప్పారు. అనేక శాఖలకు చెందిన ఉద్యోగులకు 300 శాతం వరకు జీతాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. బీజేపీ ఆరేండ్ల పాలనలో 23 ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని చెప్పారు. పట్టభద్రుల సమస్యలను ప్రశ్నించి పరిష్కరించే గొంతుగా ఉంటానని తెలిపారు. తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ సమిష్టిగా పని చేసి తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. తొలుత కళాశాల ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహానికి ఎర్రబెల్లితోపాటు నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి గ్యాదరి బాలమల్లు, నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు బొల్లం సంపత్‌కుమార్, లలిత యాదవ్, తదితరులు పాల్గొన్నారు.