Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
దళితుల, ముస్లిముల ఆహార వ్యవహారాల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేసి అరెస్టు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం లోని వివేకానంద సెంటర్‌లో ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టి బొమ్మను ఆదివారం దహనం చేశారు. ఈ సంద ర్భంగా మహేష్ మాట్లాడారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. రాజాసింగ్ మైనార్టీ ల, బహుజనుల మనోభావాలను దెబ్బ తీస్తునా ్నరని చెప్పారు. కార్యక్రమంలో కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి చీపిరి యాకయ్య, మచ్చ వెంకన్న, సూర్నపు రాజు, పులిపాక నాగరాజు, వెంకన్న, శ్రీనివాస్, యనమల కిరణ్, చిలుముల వెంక టేష్, బచ్చలి రాము, తదితరులు పాల్గొన్నారు.