Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మగౌరవం, స్వయంపాలనకు మొదలైన ఉద్యమం నీళ్లు, నిధులు, నియా మకాల సాదనకు కొనసాగిన పోరాటం కేవలం కెేసీఆర్ కుటుంబ స్వార్థ రాజకీయాలకు పునాదిగా మారిందన్నారు. వేలాది మంది నిరుద్యోగుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు గడీలలో బందీ అయిందన్నారు. సీఎం కెసిఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో దాదాపు 200 మంది రైతులు చనిపోయినా స్పందించని కేంద్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలను భరించలేక ప్రభుత్వంలో ఉంటూనే కౌన్సిల్‌లో అన్ని సమస్యలను ఎత్తిచూపి ఎండగడుతున్నందుకు సభావత్ రాములు నాయక్‌ను పార్టీ నుంచి, ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేశారని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దూడ పాక శంకర్, జిల్లా మున్సిపల్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, యూత్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి కిషన్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, మండల టౌన్ అధ్యక్షులు రమేష్, యూత్ అధ్యక్షులు నరేష్, మండల ఉపాధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.