Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ఈ నెల చివరిలోగా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కుడా వైస్ చైర్‌పర్సన్, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో కుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు అభివద్ధి పనులను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. లక్షర సింగారంలో వడ్డేపల్లి సర్‌ప్లస్ నాలపై రూ.3.5 కోట్ల అంచనాతో కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, పద్మాక్షి దేవాలయం వద్ద మోడల్ శ్మశానవాటిక పనులు పరిశీలించారు. పక్షం రోజుల్లో పనులు పూర్తి చేయాలని అన్నారు. పద్మాక్షి దేవాలయం ఆవరణలో రాష్ట్రంలో నే ప్రథమంగా రూ.50లక్షలతో చేపట్టిన సరేగమపదనిస పార్క్ పనులను పరిశీలించారు. అసంపుర్తిగా ఉన్న గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్, ప్రహరీ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆమెవెంట కుడా పీిఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, డీఈ, ఏఈలు ఉన్నారు.