Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి. హనుమంతరావు, వరంగల్ అర్భన్, రూరల్ జిల్లా డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు ప్రచారం చేశారు. శుక్రవారం ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు హన్మకొండ జులైవాడలోని కలెక్టరేట్‌లో అన్ని విభాగాల్లో తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఇ.వి. శ్రీనివాస రావు, టిపిసిసి అధికార ప్రతినిధి కానుగంటి శేఖర్, వరంగల్ జిల్లా మైనారిటీ సెల్ ఛైర్మన్ మహ్మద్ ఆయూబ్, గ్రేటర్ వరంగల్ మైనారిటీ సెల్ ఛైర్మన్ మీర్జా అజీబుల్లా పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు ప్రచారం..
కాజీపేట : వరంగల్, ఖమ్మం నల్గొండ పట్టభద్రుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ గెలిపించాలని కోరుతూ శుక్రవారం కాజీపేట మండలం సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తోందన్నారు. నిరుద్యోగ భతి ఇవ్వకుండా ఉద్యోగ నియామకాలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. యూనివర్సిటీ లో సరైన సౌకర్యాలు కల్పించకుండా కేవలం ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళుతూ మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రమా రవీందర్ యాదవ్, లింగ మౌనికచరణ్ రెడ్డి, తొట్ల రాజు యాదవ్, నాయకులు గుర్రం కోటేశ్వర్ కుమార్ పాల్గొన్నారు..
రాములు నాయక్ నికార్సైన తెలంగాణవాది : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కాశిబుగ్గ : వరంగల్, ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ నికార్సైన తెలంగాణ వాది అని టీపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ పరిచయ వేదిక కార్యక్రమం శుక్రవారం సాయంత్రం కాశిబుగ్గలోని కెవిఎస్ ఫంక్షన్ హాల్ లో డిసిసి వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సామాజిక న్యాయానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. టీఆర్‌ఎస్ బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములు నాయక్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్ ఆటలు ఇక సాగవు అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములు నాయక్ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ కార్పొరేటర్ యాకూబ్ పాషా, నల్గొండ రమేష్, భారత్, పీసీసీ కార్యదర్శులు ఇవి శ్రీనివాస్ పాల్గొన్నారు.