Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
బహుభాషా కోవిదురాలుగా జెడ్పీటీసీ పిట్టల శ్రీలత సత్యనారాయణ గుర్తింపు పొందారు. పేద కుటుంబంలో జన్మించి నిరాడంబరమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తున్నారు. చిన్నతనం నుంచే డాక్టరేట్ పొందాలనే ఆశయంతోనే ముందుకు సాగి సాధించారు. ఈ క్రమం లోనే పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న ఆమె తండ్రి సహకారంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రజా సేవకు అంకితమై పలువురి మన్ననలుపొంది నేడు జెడ్పీటీసీగా పాలన సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను నవతెలంగాణ పలకరించింది. వివారాలు ఆమె మాటల్లోనే...
మీ జెడ్పీటీసీ ప్రస్తానం ఎలా ?
'తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యతని వ్వడం, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆశీస్సులతో బీసీ అయిన తనకు జెడ్పీటీసీ బీ ఫారం ఇచ్చి గెలుపునకు కృషి చేశారు. అలాగే ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ధర్మసాగర్ మండల ప్రజలతోపాటు ప్రత్యేకంగా మహిళల అభివృద్ధికి నా వంతు చేస్తాను.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు మీరిచ్చే సలహాలు ?
నేటి అనేకమంది యువతులు పెండ్లి అనంతరం ఇంటికే పరిమితమవుతున్నారు. అలా కాకుండా ప్రతీ రంగంలో ముందుండాలనే ఆలోచనతో మహిళలు ఉండాలి. అంతరిక్షంపై కూడా మహిళలు అడుగు పెడుతున్నారు. నాకు డిగ్రీ ఫస్టియర్‌లోనే వివాహమైంది. అయినప్పటికీ చదువు ఆపకుండా పీహెచ్‌డీ పూర్తి చేశారు. పరకాలలోని ప్రయివేటు పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశాను. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న గారు మాకు ఆస్థుల కంటే చదువుకే ప్రాధాన్యం ఇచ్చేవారు.
మీ రాజకీయ ఆరంగేట్రం గురించి ?
2019లో జెడ్పీటీసీగా పోటీచేయడానికి అవకాశం లభించింది. ప్రజలకు సేవా చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందాను. ధర్మసాగర్ ప్రజలు, టీఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తల సహకారంతో భారీ మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందాను. ఎంపీ బండ ప్రకాష్ , నా భర్త, తమ్ముడు పులి రజనీకాంత్‌ల స్పూర్తితో రాజకీయాల్లో రాణిస్తున్నాను. ఐసీడీఎస్ డిపార్ట్‌మెంట్‌లో సలహాలు, సూచనలు ఇస్తూ మహిళా సాధికారతను సాధించే దిశగా పయణించేందుకు కృషి చేస్తాను.