Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్
- కేసీఆర్ కప్ అజేయులకు సాయం
నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభను కనబర్చి విజేతలుగా నిలవాలని ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ అన్నారు. మండలంలోని పస్రా లోని సెయింట్ మేరీ పాఠశాలలో ఆటల పోటీ ల్లో ప్రతిభ కనపరిచి కేసీఆర్ కప్ విజేయులుగా నిలిచిన చిన్నారులను శుక్రవారం ఆయన అభినందించి ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడారు. విద్యార్థులు అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి తక్షణ సాయం కింద రూ.25 వేల చెక్కు అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఏషియా గోవా అంతర్జాతీయ కప్ ఖర్చుల కోసం తాను అండ గా ఉంటానని చెప్పారు.
అక్కడికక్కడే రూ.25 వేల చెక్కును కరస్పాండెంట్ స్టీఫెన్‌రెడ్డికి అందజేశారు. మారుమూల ప్రాంతాల్లో వెళ్లి గోల్డ్, కాస్యం, రజత పతకాలు సాధించి జిల్లాకు మండలానికి తల్లిదండ్రులుకు, ఉపాధ్యాయులకు, కోచ్‌కు పేరు తీసుకొచ్చారని తెలిపారు. చిన్నారులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులను అభినందనలు తెలిపారు. ఏషియా గోవా అంతర్జాతీయ కప్‌లో కూడా మీరు విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు. చిన్నారులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మెన్ జగదీష్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ కన్వీనర్ పోరిక గోవింద్ నాయక్, మైనార్టీ నాయకులు తాహిర్ పాషా, కష్ణారెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు ఎర్వ వెంకటాద్రి, ములుగు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి నెమలి బాలకష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ దూడపక రాజేందర్, మండల అధ్యక్షుడు మురహరి భిక్షపతి, ఉపాధ్యక్షుడు అజీటరా సురేష్‌నాయక్, లకావత్ నర్సింహా నాయక్, రైతుబంధు అధ్యక్షుడు పిన్నటి మధుసుదన్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు వర్ధం చందర్‌రాజు, బానోత్ వెంకన్న, జన్ను రాంబాబు, రుద్రబోయిన మల్లేష్, సీనియర్ నాయకులు రాజునాయక్, ఉట్ల మోహన్, రాజశేఖర్, మువ్వ భాను, తదితరులు పాల్గొన్నారు.