Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
గ్రామాల్లో ప్రజల అవసరాలు తీర్చేందుకు శనివారం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో సర్పంచ్‌లకు, పంచాయితీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ హరిప్రసాద్ మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి వివిధ మౌలిక వసతులను ప్రజలకు కల్పించాల సూచించారు. దీనికిగాను ప్రతి ఇంటి నుంచి వందశాతం పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఊకంటి యాకూబ్‌రెడ్డి, నెలకుర్తి వెంకట్‌రెడ్డి, దర్శనం బిక్షపతి, కనకం హైమావతి, ఎడ్ల వెంకటమ్మ, కె.మంజుల, రమేష్, బోజ్య, కార్యదర్శులు పార్థసారధి, రాజు, అంజద్ అలీ, వెంకటేశ్వర్లు, షకీల్ ఉన్నారు.