Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీకరించిన మానుకోట కలెక్టర్ శివలింగయ్య
- నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన శివలింగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్‌ను జిల్లా కలెక్టర్ సీహెచ్ శివ లింగయ్య స్వీకరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నివాస ప్రాంగణంలో, కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ శివ లింగయ్య ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎస్పీ కోటిరెడ్డి, ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిలను గ్రీన్ చాలెంజ్ స్వీకరించవలసిందిగా కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలనే సీఎం కేసీఆర్ లక్షసాధనలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖులు, ఉన్నతాధికారులు మొక్కలు నాటి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్‌కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు ప్రజలు అన్ని వర్గాలకు చెందిన వారు ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారని కోరారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ మన భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి మొక్కలను పెంచడమే అని చెప్పారు. జిల్లా గ్రంథాలయ చైర్మెన్ గుడిపుడి నవీన్ రావు, జిల్లా అటవీశాఖ అధికారి కిష్ట గౌడ్, డీఆర్డీఓ సూర్య నారాయణ, డీపీఓ రంగాచారి, డీఏఓ చత్రునాయక్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయ స్వామి ఉన్నారు.