Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్ట్ పార్టీ కార్యదర్శికి జెడ్పీ చైర్మెన్ సవాల్
నవతెలంగాణ-ములుగు
తనపై చేసిన ఆరోపణల మీద ఏటూరు నాగారంలోనే ప్రజా క్షేత్రంలో తేల్చు కుందామని సీపీఐ మావోయిస్ట్ పార్టీ కార్య దర్శి సబితకు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యా లయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మావోయిస్ట్ పార్టీ ప్రకటనపై ఆయన స్పందించారు. తాను ఏటూరు నాగారంలో 34 ఎకరాల శ్మశానవాటిక భూమిని వేర్వేరు పేర్ల మీద అక్రమంగా ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలు అవాస్తవాలని తెలిపారు. ఏటూరు నాగారంలోని 20 ఎకరాల గ్రామ ఉమ్మడి భూమిని సైతం ఆక్రమించినట్టు ఆరోపణ చేయగా ఆ భూమి ఏటూరునాగారంలో ఉన్నదనే విషయం ఇప్పటి వరకు తనకు తెలియదన్నారు. ఆరో పణలు నిరాధరమని చెప్పారు. మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి సబిత బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను నిజాయితీగా ఉన్నందు వల్లే కేసీఆర్ జెడ్పీ చైర్మన్ చేశారని చెప్పారు. నాలుగు కూడా గడవకముందే ఏటూరునాగారంలోని కోడి పుంజుల అంగడి, శ్మశాన వాటిక భూములను ఆక్రమించారంటూ నింద వేయడం బాధాకర మన్నారు. కరపత్రంలో చేసిన ఆరోపణలకు మావోయిస్ట్ పార్టీ కట్టుబడి ఉంటే ప్రజాక్షేత్రంలో విచారించి ఏ శిక్ష వేసినా తాను సిద్ధమేనన్నారు.