Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్‌రావు
మండల పరిధి మల్లారం గ్రామపంచాయతీ దబ్బగట్టు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్-108 ప్రభుత్వ భూమిలో 35మంది నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించేం దుకు 2016లో అప్పటి ప్రజాప్రతినిధులు కేటాయించారు. నిర్మాణాల్లో జాప్యం నెలకొనడంతో ఇదే గ్రామానికి చెందిన కొందరు ఆ స్థలాన్ని కబ్జా చేశారు. అప్పటి వీఆర్వో ఆన్‌లైన్‌లో పట్టా సైతం చేసినట్టు తహసీల్దార్‌కు సమాచారమందింది. దీంతో ఆయన తన బృందంతో కలిసి శుక్రవారం అక్కడకు వెళ్లి మోకా పరిశీలించారు. కబ్జాదారులను పిలిపించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మల్లారం పరిధి కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, దుప్పట్ల పంపిణీ, తదితర సమస్యలపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలపై విద్యార్థులు, ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట మల్లారం ఎంపీటిసీ సభ్యుడు అవర్నేని ప్రకాష్‌రావు, ఆర్‌ఐ, విఆర్వోలు ఉ్గన్నారు.