Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రాభల్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించింది. పోలీసులు, డాక్టర్లు అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ముప్పు వాటిల్లుతోంది. ప్రభుత్వం ఇటీవల క్రమక్రమంగా లాక్‌డైన్ ఎత్తివేయడంతో ప్రజలు ఇష్టారాజ్యంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల బొంబాయి నుంచి మండలంలోని నవాబుపేట గ్రామానికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు కలకలం రేగింది. సొంత గ్రామానికి వచ్చిన వద్ధులు పాసి కంటి మల్లయ్య, వనమ్మ ఇటీవల ముంబై నుంచి నవాబుపేట గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై వీరభద్రరావు స్థానిక సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధాకర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. మూడు రోజుల తర్వాత గురువారం మల్లయ్యకు కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ వైద్యులు కరోనా పాజిటివ్ పరీక్షలు జరిపించాలని గుర్తించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇంకా అధికారికంగా తెలియరాలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.