Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం హౌం క్వారంటైన్‌లో జూనియర్ ట్రంప్
వాషింగ్టన్ : కరోనాను తేలిగ్గా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతున్నది. ఆయన కుటుంబాన్ని వైరస్ వదలడంలేదు. ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా బారినపడిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఆ తర్వాత కోలుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ (42)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తన క్యాబిన్‌లోనే హౌం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. '' జూనియర్ ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు. ప్రస్తుతం ఆయన కోవిడ్-19 మెడికల్ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ హౌం క్వారంటైన్‌లో ఉన్నారు'' అని తెలిపాడు. కాగా, జూనియర్ ట్రంప్ కరోనా బారిన పడటంతో ట్రంప్ దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు బారన్, ఇతర సిబ్బందికి వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, తాను కరోనాబారిన పడినట్టు వైట్ హౌస్ సహాయకుడు, ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కుమారుడు ఆండ్రూ గియులియాని ప్రకటించారు. కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన అవసరంలేదనీ, తాను మాత్రం మాస్క్‌ను ధరించనంటూ గతంలో ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యవహార తీరు కారణంగానే అమెరికాలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయని ఆరోగ్యనిపుణులు, ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న విషయం విదితమే.