Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాజ్యాన్ని తిరస్కరించిన పెన్సిల్వేనియా కోర్టు
- అట్లాంటాలో ట్రంప్ మద్దతుదారుల నిరసనలు...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడినా...ట్రంప్ లొల్లి మాత్రం ఆపటంలేదు. తమ మద్దతుదారులతో చేయిస్తున్న ప్రదర్శ నలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజా గా అట్లాంటాలో ట్రంప్ మద్దతుదారులు నిర సనలు కొనసాగించారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రచార బృందానికి మరోసారి చుక్కెదురైంది. నిబంధనలకు అనుగుణం గా లేని ఓట్లను తిరస్కరించాలని కోరుతూ వేసిన దావాను పెన్సిల్వేనియా జిల్లా కోర్టు నిరాకరించింది. వేల సంఖ్యలో పోలైన ఓట్లు చెల్లవంటూ ట్రంప్ బృందం చేసిన ఆరోపణలకు సరైన ఆధారాల్లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో ఎన్నికల ఫలితాలను అధికారికంగా ధ్రువీకరించవచ్చని పెన్సిల్వేనియా అధికారులకు సూచించింది. ఓట్లు చెల్లవనడానికి సరైన ఆధారాలు లేవనీ, కేవలం ఊహాజనిత ఆలోచనలతోనే ట్రంప్ బందం ఒత్తిడి తెస్తున్నట్టు పెన్సిల్వేనియా కోర్టు న్యాయమూర్తి మ్యాథ్యూ బ్రాన్ స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పుపై ట్రంప్ ప్రచార బందం తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను చూపేందుకు సరైన సమయం ఇవ్వకుండానే కోర్టు మా విన్నపాన్ని కొట్టివేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే, తొందరగా తీర్పు చెప్పడం వల్ల సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యిందని అభిప్రాయపడింది. ఇక, 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో జో బైడెన్ దాదాపు 81 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించలేదంటూ.. లక్షల సంఖ్యలో పోలైన ఓట్లను రద్దు చేయాలంటూ ట్రంప్ బృందం వాదిస్తోంది. ఇందులో భాగంగా కోర్టును ఆశ్రయించగా తాజాగా దీన్ని కొట్టివేసింది.
అధ్యక్షమార్పిడి చట్టం ప్రక్రియ షురూ..
ఓటమిని అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్ న్యాయపరంగా పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు కోర్టుల్లో దావాలు నడుస్తున్న సమయంలో అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ అధ్య క్ష మార్పిడి చట్టం (ప్రెసిడెన్షియల్ ట్రాన్సషన్ యాక్ట్) ప్రకారం పాటించాల్సిన ప్రక్రియను షురూ చేశామని వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. అధికార యం త్రాంగం తరఫున చేయాల్సిన పనులను చేస్తు న్నామ ని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై అధికారిక ధ్రువీక రణ పత్రాలు ఇంకా అందకపోవడంతో అధి కార మా ర్పిడిని పర్యవేక్షించాల్సిన జనరల్ సర్వీసెస్ అడ్మిని స్ట్రేషన్ విభాగం కూడా మౌనం పాటిస్తోంది. బైడెన్ విజయం సాధించినట్టు ఆ విభాగం అడ్మిని స్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ ఇంతవరకు గుర్తించలేదు. తగిన సమ యంలో ఈ గుర్తింపు వస్తుందని ఎనానీ చెప్పారు.
ఒబామా హితవు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్‌కు హితవు చెబుతూ...బైడన్ గెలుపును అంగీకరించాలన్నారు. అధికారమార్పిడికి సహకరించి అన్నీ సక్రమంగా జరగటానికి తోడ్పాటు అందించాలని కోరారు.