Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్ : 2023లో జీ-20 సదస్సుకు భారత్ వేదిక కానున్నది. ఇంతకుముందు నిర్ణయించిన దాని కంటే ఒక సంవత్సరం తరువాత ఈ ఉన్నతస్థాయి సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తుందని సభ్య దేశాల నేతలు ఆదివారం పేర్కొన్నారు. గతేడాది జరిగిన సదస్సులోని ఒసాకా తీర్మానం ప్రకారం 2022లోనే జీ-20 సదస్సు భారత్‌లో నిర్వహించాల్సి ఉంది.సౌదీ అరేబియాలో రెండు రోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు ఈ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం 2021 సదస్సు ఇటలీలో, 2022 సదస్సు ఇండోనేషియాలో నిర్వహిస్తారు. 2023లో జరిగే సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఆ తరువాత సంవత్సరం బ్రెజిల్‌లో నిర్వహించనున్నారు.