Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బునస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించారు. మెరుపు గోల్స్ కొడుతూ ఫుట్‌బాల్ ఆటలో 'ది గోల్డెన్ బారు'గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా ఆయన ప్రపంచస్థాయి కీర్తి గడించారు.నాలుగు సార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో.. 1990 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఆయన బొకా జూనియర్స్, నాపోలి, బార్సిలోనా క్లబ్ జట్ల తరఫున పలు మ్యాచ్‌లు ఆడారు. 1991లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ ఆయన 15నెలల పాటు ఆట నుంచి నిషేధానికి గురయ్యారు. అలా.. అమెరికాలో జరిగిన ప్రపంచకప్ టోర్నీకి కూడా దూరమయ్యారు. 1997లో ఫుట్‌బాల్ కు వీడ్కోలు పలికారు. 2004లో శ్వాసకోశ, హృద్రోగ సమస్యల బారినపడ్డారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్లకు మేనేజర్‌గానూ పనిచేశారు.