Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఏడాది ఐదు మిలియన్ల మరణాలను నివారించవచ్చు
- ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాలు
జెనీవా: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేదా వైకల్యంతో జీవిస్తున్న వారితో పాటు వయోజనులందరూ తప్పనిసరిగా వ్యాయమం, ఎరోబిక్ వంటి శారీరక కార్యకాపాలను ఒక వారంలో కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఇలా చేయడం ద్వారా ప్రతి సంవత్సరం 5 మిలియన్ల ప్రాణాలు పోకుండా కాపాడుకోగలమని పేర్కొంది. వ్యాయామం శరీరానికి ఎంతో అవసరమని పేర్కొంటూ ఈ మేరకూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాల ప్రకారం.. పిల్లలు, కౌమారదశలో (5 నుంచి 17 ఏండ్లు) ఉన్న వారు నిత్యం 60 నిమిషాలకు పైనే వ్యాయామం, ఏరోబిక్ లాంటివి చేయాలనీ, వారంలో మూడు రోజులు ఇదే సమయంలో కండరాలు, ఎముకలను బలోపేతం చేసే కార్యకాలాపాలు చేయాలని తెలిపింది.
కరోనా కారణంగా అనేక రోజువారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయనీ, వైరస్ అందరిని ఇంటికే పరిమితం చేసిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దీని కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని వెల్లడించింది. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా వ్యాయామం, ఏరోబిక్‌లలో పాలుపంచుకోవాలని సూచించింది. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన సిఫారసులను ప్రతి నలుగురు వయోజనులలో ఒకరు (మొత్తం 27.5 శాతం), కౌమార దశలో ఉన్న ప్రతి ఐదుగురిలో నలుగురు (81 శాతం) అందుకోలేక పోయారని పేర్కొంది. డైరెక్ట్ హల్త్ కేర్ ఖర్చు 54 బిలియన్ డాలర్లు అంచనా వేయబడింది. దానికి అదనంగా మరో 14 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. గత దశాబ్దంలో శారీరక కార్యకలాపాల (వ్యాయామం, ఏరోబిక్ లాంటివి) స్థాయిలలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని తెలిపింది.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశముందని తెలిపింది. జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు మెదడు పనితీరులో మెరుగైన ఫతితాలు వ్యాయామం చేయడం వల్ల ఉంటాయని తాజా డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండాలనీ, దీంతో అనారోగ్య సమస్యలు దరిచేరవని డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ప్రమోషన్ హెడ్ రూడిగెర్ క్రెచ్ అన్నారు. కరోనా కారణంగా నిత్య జీవిత కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన తెలిపారు.