Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిలీలో కొనసాగుతున్న నిరసనలు
సాంటిగో డె చిలీ : అధ్యక్షుడు సెబెస్టాయిన్ పినెరా రాజీనామా డిమాండ్‌తో చిలీ లో నిరసనలు కొనసాగుతు న్నాయి. రాజధానిలో వివిధ ప్రదేశాల్లో ఆందోళన చేస్తున్న నిరసనకారులు అధ్యక్ష భవాన్ని ముట్టడించడానికి ప్రయత్నిం చారు. దీంతో భద్రతా సిబ్బంది నిరసనకారుల్ని అడ్డుకోవడం, భవనం చుట్టూ ఎతైన కంచెలు నిర్మించడం చేశారు.
దేశంలో కొన్ని రోజులు నుంచి ఇలాంటి నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల కింద చిలి యూనివర్సిటీ వద్ద వేలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణ కూడా దిగారు. దీంతో వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు ఉపయోగించాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు చేసిన రాజ్యంగ సవరణను నేషనల్ కాంగ్రెస్ ఆమోదించకుండా అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తుండటంతో అతనిపై ప్రజలు ఆగ్రహాంతో ఉన్నారు.