Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : ముంబయి దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది 61 ఏళ్ల జాకీర్ రెహమాన్ లఖ్వీని పాకిస్తాన్‌లో అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్న ఆరోపణలపై అతనిని అరెస్టు చేశారు. ముంబయి దాడుల కేసులో అరెస్టయి, 2015 నుంచి బెయిల్‌పై నున్న ఆయనను పంజాబ్ ఫ్రావిన్స్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సిటిడి) అరెస్టు చేసింది. ఎక్కడ అరెస్టు చేశామన్న విషయాన్ని సిటిడి వెల్లడించలేదు. పాక్‌లోని పంజాబ్‌లో నిఘా ఆపరేషన్ చేపట్టిన సిటిడి... అనంతరం ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పేర్కొంది. లఖ్వీ ఓ డిస్పెన్సరీ నడుపుతున్నాడని, దానికొచ్చిన నిధులను ఉగ్రవాదానికి వినియోగించడంతోపాటు తన వ్యక్తిగతానికి జాకీర్ ఉపయోగించారని తెలిపింది.