Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఈ నెల 20న జరిగే అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరుకాబోనని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను నూతన అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. ఇది మంచి ఆలోచన అని వ్యాఖ్యానించారు. ట్రంప్ దేశానికి ఇబ్బందికరంగా మారారని, అటువంటి వ్యక్తి తన ప్రమాణ స్వీకారానికి రాకపోవడమే మంచిదని అన్నారు. దేశానికి సేవ చేసేందుకు తగిన వ్యక్తి కాదని, దేశ చరిత్రలో అత్యంత అసమర్థ అధ్యక్షుడు ట్రంపేనని వ్యాఖ్యానించారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను ఆహ్వానిస్తానని అన్నారు.
పథకం ప్రకారమే దాడి ట్రంప్ పార్టీ వీడియో వైరల్
క్యాపిటల్ హిల్స్‌పై దాడిలో ట్రంప్ ప్రమేయానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్వేతజాతి దుర్హంకారులైన తన అనుచరుల మూకలను ఉత్సాహపరుస్తూ ట్రంప్ నృత్యాలు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా, కుమారుడు జూనియర్ ట్రంప్ ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. వైట్ హౌస్ ఎదుట ఒక టెంట్‌లో ఈ పార్టీ నిర్వహించినట్లు సమాచారం. జూనియర్ ట్రంప్ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఈ వీడియో బుధవారం ట్రంప్ ప్రసంగానికి ముందా లేదా ప్రసంగం తరువాత చిత్రీకరించిందా అనేది స్పష్టతలేదు.
ఈ వీడియోలో ట్రంప్ పదేపదే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై దాడి చేయడంతో పాటు కష్టపడి పోరాడండి, కాపిటల్‌కు నడవండి, ఎందుకంటే మన దేశం బలహీనంగా మారడాన్ని మీరు అంగీకరించలేరంటూ అనుచర మూకలను ఎగదోయడం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. వారిని దేశభక్తులుగా పేర్కొంటూ పోరాడండి అంటూ ఛీర్ అప్ చేస్తున్నారు. వారంతా కాపిటల్ భవనాన్ని ముట్టడించేందుకు వెళుతున్నారని చెప్పారు. ట్రంప్, ఇవాంకాలు వైట్‌హౌస్ సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్న దృశ్యాలను చూపించేందుకు ఫోన్‌ను అటూ ఇటూ తిప్పుతుండగా, మరోవైపు మద్దతుదారులు కాపిటల్ భవనంపైకి దూసుకెళుతున్న దృశ్యాలు భారీ స్క్రీన్‌లపై కనిపిస్తున్నాయి. జూనియర్ ట్రంప్ స్నేహితురాలు మాట్లాడుతూ.. మైక్‌పెన్స్ తన తెలివితేటలతో బైడెన్ ఎన్నిక ద్రువీకరణ ప్రక్రియను తప్పకుండా ఆపగలరని, ఆ నమ్మకం తనకుందని అన్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పాప్ సాంగ్స్ వస్తుండగా.. వారంతా బిగ్గరగా నవ్వుతూ.. చిందులేస్తున్నారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగిన దాడి అని వీడియో చూస్తే అర్థమౌతుంది. ట్రంప్ అధ్యక్ష పదవి నుండి వైదొలగాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.
డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ విజయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు సెనెట్, కాంగ్రెస్ సభ్యులు సమావేశమైన కొద్ది సేపటికే ఈ దాడి జరిగింది. దాడి జరిగిన చాలా సేపటి తర్వాత మద్దతుదారులు ఇళ్లకు వెళ్లండి అంటూ టంప్ ఒక షార్ట్ వీడియోను విడుదల చేయడం గమనార్హం.