Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ట్రంప్‌ ఖాతా క్లోజ్‌ ! | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

ట్రంప్‌ ఖాతా క్లోజ్‌ !

- శాశ్వతంగా నిషేధిస్తున్నామని ట్విట్టర్‌ ప్రకటన
- సందేశాలతో మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందన్న ట్విట్టర్‌
- ఒక వర్గం ప్రజల్ని రెచ్చగొట్టినందుకే..
- జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం రోజున అల్లర్లకు ప్రణాళిక !
- ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం ఖాతాలు సస్పెండ్‌ : జుకర్‌బర్గ్‌
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నామని సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల క్రితం క్యాపిటల్‌ బిల్డింగ్‌పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ఇటీవల ట్రంప్‌ చేసిన ట్వీట్స్‌ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్‌ వివరణ ఇచ్చింది. దీనికితోడు మరోసారి హింసాత్మక అల్లర్లకు మద్దతిచ్చే అవకాశముందని ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్‌ తెలియజేసింది. అంతేగాక..కొత్త అధ్యక్షుడుగా ఎంపికైన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం రోజున సామాజిక మాధ్యమం ద్వారా నిరసనలను ప్రోత్సహించే ప్రమాదముందని తాజా నిర్ణయం తీసుకున్నట్టు సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ ఖాతాలను 12 గంటలపాటు స్తంభింపజేస్తున్నట్టు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తొలుత ప్రకటించాయి. జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించే రోజువరకూ ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను నిలిపివేస్తున్నామని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ చెప్పారు. అయితే ట్విట్టర్‌ తాజా ప్రకటన నేపథ్యంలో, ఫేస్‌బుక్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తన వ్యక్తిగత ఖాతాను నిషేధించటంతో, ట్రంప్‌ 'ప్రెసిడెంట్‌ ట్రంప్‌' ఖాతాలో సందేశాలు పోస్ట్‌ చేశారు. ఈ పోస్టులను ట్విటర్‌ తొలగించటంతో, 'టీమ్‌ ట్రంప్‌' ఖాతాను ఉపయోగించారు. తిరిగి అవే వ్యాఖ్యల్ని ఈ ఖాతాలో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. దాంతో 'టీమ్‌ ట్రంప్‌' ఖాతాను కూడా ట్విట్టర్‌ నిషేధించింది.
ప్రపంచ నేతలకు మినహాయింపు !
ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాకు 8.87కోట్లమంది, ఫేస్‌బుక్‌ ఖాతాకు 3.52కోట్లమంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.45కోట్లమంది ఫాలోవర్లున్నారు. చాలాకాలంగా ట్రంప్‌సహా వివిధ ప్రపంచ నేతలకు నిబంధనలలో కొంతమేర మినహాయింపులను అమలుచేస్తున్నట్టు ట్విట్టర్‌ ఈ సందర్భంగా వెల్లడించింది. వ్యక్తిగత దూషణలు, విద్వేష ప్రసంగాలు తదితర విషయాలలో ప్రపంచ నేతలకు నిబంధనల నుంచి మినహాయింపులు ఇస్తున్నామని తెలియజేసింది.
ట్విట్టర్‌ చాలా ఆలస్యం చేసింది : రాజకీయ విశ్లేషకులు
క్యాపిటల్‌ బిల్డింగ్‌ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనల తదుపరి సామాజిక మాధ్య మాల తీరు విమర్శలపాలైంది. ముఖ్యంగా ట్విట్టర్‌ 'పౌర నైతిక విధానా'న్ని అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే ఉల్లంఘించినా చర్యలు తీసుకోకపోవటాన్ని రాజ కీయ విశ్లేషకులు తప్పుబట్టారు. తన మద్దతుదారుల్ని ఉసిగొల్పుతూ ట్రంప్‌ ప్రసంగించిన వీడియోను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తొలగించాయి. అయితే ట్రంప్‌ మాట్లాడిన మాటలు ప్రపంచానికి చేరిపో యాయి. సోషల్‌ మీడియా కంపెనీలు చెబుతున్న నిబంధనలు గోడమీద రాతలుగా మారాయని కొంతమంది విమర్శిస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌.. తమ సొంత లాభాలు చూసుకుంటున్నాయని, షేర్‌ హోల్డర్లకు లాభాలు రావటంపైనే దృష్టి సారించాయి తప్ప, 'నైతిక విధానాల'ను పకడ్బంధీగా అమలుజేయటం లేదని ఆరోపణలున్నాయి.
అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చాకే..
ఓవైపు ఫేస్‌బుక్‌ తాత్కాలికంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను ఈనెల 20వరకు నిలిపివేయగా, ట్విట్టర్‌ తొలుత 12గంటలపాటు ట్రంప్‌ ఖాతాను (క్యాపిటల్‌ బిల్డింగ్‌ దాడి జరిగాక) స్తంభింపజేసింది. హింసాత్మక ఘటనల అనంతరం వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు ట్రంప్‌ ఖాతాను సస్పెండ్‌ చేయక తప్పలేదు. ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్‌ శాశ్వతంగా నిషేధించగా, ఫేస్‌బుక్‌ సైతం అదే బాటలో నడిచే వీలున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్‌నకు మద్దతిచ్చే మాజీ భద్రతా సలహాదారు మైఖేల్‌ ఫ్లిన్‌, అటార్నీ సిడ్నీ పోవెల్‌ ఖాతాలనూ శాశ్వతంగా నిషేధించినట్టు ట్విట్టర్‌ తాజాగా వెల్లడించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపికపై డెమోక్రాట్ల వ్యతిరేకత
ఆమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనిజులా
రష్యా ప్రతిపక్ష నేత అప్పీల్‌ తిరస్కృతి
ఉబర్‌పై బ్రిటన్‌ కోర్టు రూలింగ్‌ నేపథ్యంలో క్యాజువల్‌ కార్మిక విధానంపై విస్తృత యుద్ధం!
ఆస్ట్రేలియా వార్తల నిలిపివేత నిర్ణయంపై వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్‌
అమెరికాలో ప్రవాసులకు ఊరట
మయన్మార్‌ ఆందోళనల్లో గాయపడిన మహిళ మృతి
పరాగ్వే ప్రతిపక్ష నేత అలెగ్రే విడుదల
కార్పొరేట్‌ లాభార్జన విధానాల వల్లే టెక్సాస్‌ విద్యుత్‌ సంక్షోభం

తాజా వార్తలు

06:35 PM

కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం.. మరో ఏడుగురికి పాజిటివ్

06:06 PM

షర్మిల ఎదుగుదలను తట్టుకోలేకపోయిన రేవంత్ : దేవెందర్ రెడ్డి

06:02 PM

పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుపై జగన్ సమీక్ష

05:55 PM

గృహ రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ

05:48 PM

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

05:41 PM

మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి

05:30 PM

న్యాయవాదుల హత్య కేసు.. పార్వతీ బ్యారేజీలో కత్తి లభ్యం

05:22 PM

బొల్లారంలో మహిళ దారుణ హత్య

05:12 PM

అమిత్ షాపై పరువునష్టం కేసు వేస్తా : మాజీ సీఎం

05:04 PM

మెదక్‌ జిల్లాలో చిరుత కలకలం

04:56 PM

యువతుల కొత్త తరహా దందా.. పోలీసుల రాకతో వెలుగులోకి..

04:42 PM

మహబూబ్​నగర్​లో గ్రనేడ్ కలకలం..

04:33 PM

కాలేజీ బస్సు బోల్తా..50మంది విద్యార్ధులకు గాయాలు

04:19 PM

దారుణం.. యువతి కాళ్లు చేతులు కట్టేసి ఓ తోటలో...

03:57 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

03:51 PM

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

03:41 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

03:33 PM

పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్​ రావు దంపతుల హత్య : జీవన్ రెడ్డి

03:21 PM

న్యాయవాదుల హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

03:13 PM

టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

03:07 PM

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

03:01 PM

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాన్సీ సెహ్ గల్

02:58 PM

బెంగాల్​లో 8 దశల పోలింగ్​పై సుప్రీంలో పిటిషన్..

02:37 PM

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరికి గాయాలు

02:15 PM

ఈటల, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు..

02:08 PM

ఎన్నికల కోడ్‌ వల్లే చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు..

01:57 PM

ఘోర ప్రమాదం.. టీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

01:51 PM

నటి హిమజకు లేఖ రాసిన పవన్ కళ్యాణ్

01:48 PM

పీఎఫ్ ఖాతాదారులకు షాక్..!

01:43 PM

ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల‌బుల్: కేటీఆర్​

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.