Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: ప్రపంచంలోనే మొదటిసారిగా తల్లినుంచి బిడ్డకు హెచ్‌ఐవి సోకకుండా పూర్తిగా నిర్మూలించిన దేశంగా క్యూబా రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. వైరస్ సోకకుండా హెచ్‌ఐవి నిర్మూలించడం అనేది ప్రజారోగ్య రంగానికి సంబంధించి చాలా గొప్ప విజయమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ తెలిపారు. ఎయిడ్స్ రహిత సమాజాన్ని సృష్టించేందుకు ఇది ఉపయోగపడుతుందని..ఎన్నో ఏళ్లుగా హెచ్‌ఐవి నివారణ దిశగా పోరాటం చేస్తున్న తమకు ఇది గొప్ప ముందడగని ఆమె ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 1.4 మిలియన్ల మహిళలు హెచ్‌ఐవితో బాధపడుతున్నారని, 15 నుంచి 45 శాతం మంది చిన్నారులు పుట్టుకతోనే ఈ వైరస్‌తో పుడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో విజ యాలను సొంతం చేసుకున్న దేశాలున్నప్పటికీ క్యూబా దేశం వాటికి ధీటుగా సత్తా చాటింది. హెచ్‌ఐవి వ్యాధి తల్లి నుంచి బిడ్డకు సోకకుండా నిర్మూ లించడం మిగతా దేశాలకు ప్రేరణగా నిలుస్తుందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.