Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనిజులా మాజీ అధికారులతో అమెరికా రహస్య మంతనాలు
వాషింగ్టన్ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా కుట్ర పన్నింది. సైనిక కుట్ర జరిపేందుకు గల అవకాశాలపై అమెరికా అధికారులు వెనిజులా సాయుధ బలగాల్లోని కొంతమందితో రహస్యంగా సమావేశాలు నిర్వహించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. అమెరికాకు చెందిన 11మంది మాజీ, ప్రస్తుత అధికారులు, వెనిజులా మాజీ కమాండర్‌ల ఇంటర్వ్యూల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఈ కథనం ప్రచురించింది. గత ఏడాదిలో ప్రారంభమైన ఈ సమావేశాలు ఈ ఏడాది కూడా కొనసాగాయని తెలిపింది.
ఈ సమావేశాలన్నీ అమెరికాలో కాకుండా విదేశాల్లోనే జరిగినప్పటికీ కచ్చితంగా ఎక్కడ జరిగాయన్నది మాత్రం ఆ కథనం వివరించలేదు. వెనిజులాలో సైనిక చర్య అవకాశాన్ని తోసిపుచ్చ లేమని గతేడాది ఆగస్టులో ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో వెనిజులా సైనికాధికారికి చెందిన వర్గం అమెరికా ప్రభుత్వ అధికారులను కలిసినట్టు తెలు స్తోంది. దాడి జరిపే అవకాశంపై వారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్, జాతీయ భద్రతా మాజీ సలహాదారు మెక్‌మాస్టర్ వంటి వారితో చర్చలు జరిపినట్టు ఆ కథనం పేర్కొంది.