Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ వర్షాలు, వరదలు, రాకాసి అలలు
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
వాషింగ్టన్ : అమెరికా, చైనా దేశాల్లో ఒకేసారి రెండు పెను తుఫానులు సంభవిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు, రాకాసి అలలు సంభవించే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అమెరికాలోని కరోలినా ప్రాంతాన్ని 'ఫ్లోరెన్స్' తుఫాను తాకగా, మరోవైపు హాంకాంగ్, దక్షిణ చైనాల దిశగా మంగ్‌హట్ తుఫాను పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగ్‌హట్ తుఫానును 'సూపర్ టైఫూన్'గా పేరు పెట్టారు. దీని ధాటికి గంటకు 155కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వారాంతానికి దక్షిణ చైనాకు సమీపంగా తుఫాను తాకుతుందని, ఫిలిప్పీన్స్‌లో కూడా ఈ తుఫాను తన ప్రభావాన్ని కనబర్చవచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే ఫిలిప్పీన్స్‌ను భారీ తుఫాను దెబ్బతీసింది. ఇది రెండోది. కాగా దాదాపు 4.3కోట్ల మంది ప్రజలు మంగ్‌హట్ తుఫాను బారినపడతారని ఐక్య రాజ్య సమితి ప్రపంచ విపత్తుల సమన్వయ సంస్థ (జిడిఎసిఎస్) అంచనా వేసింది. కాగా, మరోవైపు అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన ఫ్లోరెన్స్ తుఫాను ఉత్తర కరోలినా దిశగా పయనిస్తోంది. దశాబ్దాల కాలంలో నాల్గవ కేటగిరీకి చెందిన తుఫాను కరోలినా రాష్ట్రాలను తాకడం ఇదే ప్రథమం.