Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీటీఐ ప్రభుత్వంపై విమర్శలు
ఇస్లామాబాద్: ప్రభుత్వ ఖర్చుల్లో పొదుపు మంత్రం జపిస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తొలి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆహ్వానం మేరకు ఆయన సౌదీకి వెళ్లారు.
ఖర్చుల్లో పొదుపు పాటించి ప్రజాధనాన్ని వృథా చేయకూడదని కొద్ది రోజుల క్రితమే ఆయన అధికారులకు, మంత్రులకు పిలుపునిచ్చారు. కానీ తాను మాత్రం సౌదీ పర్యటనకు వీవీఐపీ ప్రత్యేక విమానంలో వెళ్లడం గమనారÛ్హం
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిరాడంబరంగా ఉండి ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలని అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ తెహ్రీక్ ఇ-ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విదేశీ పర్యటనల్లో సైతం ప్రథమ శ్రేణి ప్రయాణాలు కాకుండా బడ్జెట్‌కు లోబడే విదేశీ ప్రయాణాలుండాలని ఇమ్రాన్ తన ప్రయాణాల్లోనూ కోత విధించారు. అయితే, ఇప్పుడు మొట్టమొదటి విదేశీ పర్యటనకే ఇలా వీవీఐపీ ప్రత్యేక విమానాన్ని ఆశ్రయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ అధ్యక్షుడి దగ్గర్నుంచి అర్మీ అధికార సిబ్బంది వరకు అందరి ప్రయాణ ఖర్చుల్లో కోత విధించిన ఇమ్రాన్ తన పర్యటనకు మాత్రం ప్రత్యేక సదుపాయాలున్న విమానంలో ప్రయాణించడంపై రాజకీయ పార్టీలు ఇమ్రాన్‌పై గుర్రుమంటున్నాయి. ''లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందుల పేరుతో అత్యంత ఖరీదైన వస్తువులు, కార్లను వేలానికి పెడుతూ ప్రధాని మాత్రం విలాసవంతమైన విమానాల్లో ప్రయాణిస్తున్నారు'' అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సౌదీ పర్యటనలో భాగంగా ఆ దేశపు రాజుతో ఇమ్రాన్ భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరిద్దరు చర్చించనున్నట్టు అక్కడి మీడియా తెలిపింది. దీంతోపాటు ఆసియాకప్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం జరగబోయే భారత్-పాక్ మ్యాచ్‌ను ఆయన ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఇమ్రాన్‌తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి, ఆర్థిక శాఖ మంత్రి అసాద్ ఉమర్, సమాచార శాఖ మంత్రి చౌదరి, వాణిజ్య సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్ సౌదీకి వెళ్లారు.
సమావేశాల్లో ఇక భోజనం కట్..!
ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో, ప్రజా ప్రతినిధులతో నిర్వహించే సమావేశాల్లో ఇకపై భోజనాలను రద్దు చేసి దాని స్థానంలో బిస్కెట్లను మాత్రమే అందించనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. విదేశీయులతో సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే విందులు ఉంటాయని ఉద్ఘాటించారు. లోటు బడ్జెట్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకే తామీ చర్యలు చేపడతామని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయాణ ఖర్చుల్లోనూ కోత విధించారు. అంతర్గతంగా జరిగే సమావేశాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. లోటు బడ్జెట్‌ను అధిగమించేందుకు పాక్ ప్రభుత్వం చిన్న చిన్న మార్గాల ద్వారా నిధులను సేకరిస్తోంది. అత్యంత విలాసవంతమైన కార్లను, వస్తువులను వేలానికి పెట్టింది.