Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారకాస్: వెనిజులాపై అమెరికా అమలు చేస్తున్న ఆంక్షలతో ఆ దేశానికి దాదాపు 35 వేల కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని లాటిన్ అమెరికన్ జియో పొలిటికల్ స్ట్రాటజిక్ సెంటర్ (సెలాగ్)కు చెందిన ఆర్థిక వేదిక తన తాజా అధ్యయన నివేదికలో వెల్లడించింది. అమెరికా, దాని మిత్ర దేశాల ఆంక్షల కార ణంగా వెనిజులాకు 2013-17 మధ్య కాలంలో వస్తు ఉత్పత్తి, సేవల రంగంలో దాదాపు 35 వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని సెలాగ్ నివేదిక వెల్లడించింది. ఒక దేశాన్ని ఆర్థికంగా దిగ్బంధించటం అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తొక్కిప ట్టేందుకు ప్రయత్నించటమే అవుతుందని సెలాగ్ స్పష్టం చేసింది.