Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ వైట్‌హౌస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్‌లో శుద్ధి పనులను తిరిగి ప్రారంభించిన ఇరాన్‌పై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. పోర్డో న్యూక్లియర్ ప్లాంట్‌పై ఇటీవల ప్రకటించిన ఆంక్షల మాఫీని రద్దు చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. 'యురేనియం శుద్ధిని తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. అందువల్ల పోర్డో ప్లాంట్‌పై అమెరికా ప్రకటించిన ఆంక్షల మాఫీని రద్దు చేస్తున్నాం. ఈ నిర్ణయం వచ్చే నెల 15 నుంచి అమలులోకి వస్తుంది' అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఇరాన్‌తో జరిగిన అణు ఒప్పందం నుంచి 2015లో అమెరికా బయటకు వచ్చింది. చమురు ఎగుమతులపై ఆధారపడ్డ ఇరాన్‌పై ఒత్తిడి తేవడానికి ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధింస్తోంది. ఇరాన్‌తో అన్ని వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకువస్తోంది.