Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 మంది మృతి, 18 మందికి పైగా గాయాలు
ట్యునీస్: ట్యునీషియా దేశంలోని ఉత్తర ప్రాం తంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు టునీస్ నగరం నుంచి పర్యాటక ప్రాంతమైన ఐన్ డ్రాహామ్ కు ఎయిన్ స్నోస్సీ సమీ పంలో ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 18మంది తీవ్రంగా గాయపడ్డారని పర్యా టక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో బస్సు పైభాగం పైకి లేచిపోవటంతో మృతదేహాలు లోయలో చెల్లా చెదురుగా పడిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.