Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల బిల్లుపై హాంకాంగ్ సీఈవో
హాంకాంగ్: అమెరికా ప్రభుత్వం తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ ఇక్కడి అస్థిరతకు ఆజ్యం పోస్తోందని హాంకాంగ్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ( సీఈవో ) కారీ లామ్ విమర్శించారు. హాంకాంగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలకు మద్దతుగా ఇటీవల యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన 'హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ' బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేయటంపై తీవ్రంగా స్పందించిన లామ్ అసలు ఆ చట్టం పూర్తిగా అవసరమని వ్యాఖ్యానించారు. ఈ చట్టం నగరంపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు వ్యాపార విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుందన్నారు. ఈ బిల్లు నగర వ్యవహారాలలో తీవ్ర అనిశ్చితిని, అస్థిరతను కలిగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో తాము చైనా ప్రభుత్వాన్ని అనుసరిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అమెరికా ఆమోదించిన ఈ చట్టంపై స్పందించిన చైనా ఇది తమ అంతర్గత వ్యవహారాలలో అవాంఛిత జోక్యమే అవుతుందని, దీనికి తాము ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. హాంకాంగ్ రేవుల్లో అమెరికన్ యుద్ధ నౌకలు నిలిచేందుకు ఇప్పటి వరకూ ఇచ్చిన అనుమతిని తాము ఉపసంహరించుకుంటున్నట్టు చైనా ప్రకటించింది. హాంకాంగ్‌లో ఆందోళనకారులను రెచ్చగొడుతూ నేరాలను ప్రోత్సహిస్తున్న అమెరికన్ స్వచ్ఛంద సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది.