Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 256 మంది మృతి
కాంగో: తూర్పు ఆఫ్రికాలో గత రెండు నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా వందలాది గ్రామాలు, పంట పొలాలు నీటమునిగాయి. వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. వరదల కారణంగా ప్రాథమిక అవసరాలు లభ్యం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కుండపోత వర్షాల కారణంగా 265 మంది మృతిచెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
భారీ ఆస్తినష్టం జరిగిందని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ క్రాస్ బృందాలు పర్యటిస్తూ వరద బాధితులకు సహాయం అందిస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పు ఆఫ్రికా వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా కెన్యా, సోమాలియా, బురుండి, టాంజానియా, దక్షిణ సూడాన్, ఉగాండా, డిబౌటీ, ఇథియోపియాలో దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది.