Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా నుంచి యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం
అంకారా: అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను, యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని టర్కీ నిర్ణయించుకుంది. ఈమేరకు ఓ ప్రకటన వెల్లడించింది. అయితే, టర్కీ దేశానికి నాటోలో సభ్యత్వమున్నది. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను, యుద్ధ విమానాలను కొనుగోలు చేయొద్దని టర్కీని అమెరికా హెచ్చరించింది. తమ ఆదేశాలను బేఖాతర్ చేసినట్టయితే భారీ ఆంక్షలు మోపుతామని తెలిపింది. అయితే, అమెరికా ఆంక్షలను టర్కీ పెడచెవిన పెట్టింది. అత్యాధునిక రష్యా క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అంతేగాకుండా, రష్యాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. గతంలో అమెరికా నుంచి ఎఫ్-35 యుద్ధ విమానాలను టర్కీ కొనుగోలు చేసేది.
అయితే, రష్యా తయారు చేస్తున్న యుద్ధ విమానాల్లో అత్యంత సాంకేతిక నైపుణ్యత ఉండటంతో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయలేమని తెలిపింది. టర్కీ చర్యలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
లండన్‌లో జరిగిన నాటో సభ్యదేశాల సమావేశంలో రష్యా నుంచి ఎస్-400 యుద్ధ విమానాల కొనుగోలు అంశం చర్చకు వచ్చినట్టు ఇంటర్‌ఫాక్స్ మీడియా సంస్థ తెలిపింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. టర్కీపై భారీ ఆంక్షలు తప్పని ట్రంప్ హెచ్చరించారు.