Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్జీర్స్ : అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌అజీజ్ బౌటెఫ్లికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశాధ్యక్షుడు రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని వేలాది మంది నిరసనకారులు అల్జీర్స్ వీధుల్లోకి చేరుకొని నినాదాలు చేశారు. గత కొంతకాలంగా అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెజెయ, ఓరాన్, బట్నా, టిజి ఓవుజ్నో నగరాల్లో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఇక నిరసకారులతో సహా అరబిక్ మరియు ఫ్రెంచ్ హ్యాష్‌ట్యాగులతో ఆన్‌లైన్ లో హోరెత్తిస్తున్నారు.