Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : అను మానిత ఫ్రెంచ్ మిలిటెం ట్లను అదుపులోకి తీసుకున్న ట్టు టర్కీ ప్రభుత్వం సోమ వారం వెల్లడించింది. వీరంద రినీ దేశ బహిష్కరణ చేయ నున్నట్టు తెలిపింది. విదేశీ మిలిటెంట్ల కారణంగా టర్కీలో ఉగ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక ఘటనలు బాగా పెరిగిపోయాయని తెలిపింది. గతనెల11 నుంచి ఈనెల8 నాటికి 71 మంది విదేశీ మిలిటెంట్లను దేశ బహిష్కరణ చేసి వారి స్వదేశాలకు పంపించినట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై గతవారం 18 మంది జర్మనీ పౌరులను దేశ బహిష్కరణ చేసినట్టు తెలిపింది. 1200 మంది విదేశీ మిలిటెంట్లు తమ కస్టడీలో ఉన్నారని తెలిపింది. ఈనెల 31లోపు వీరందరినీ విచారించి విడుదల చేయనున్నట్టు తెలిపింది.