Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేప్‌టౌన్: 70 ఏనుగులను చంపనున్నట్టు దక్షిణాఫ్రికా సర్కారు ప్రకటించింది. దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఐదువేల ఒంటెలను చంపాలని తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికుల నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని అనుసరిస్తూ దక్షిణాఫ్రికాలోని బోట్వాన్సా ప్రభుత్వం ప్రకటించింది. రోజురోజుకు ఒంటెలు, ఏనుగుల జాతులు అంతరించిపోతున్నాయని వాటి సంఖ్య తగ్గుముఖం పడుతోందని తాము భావిస్తోంటే ప్రభుత్వాలు ఒంటెలను, ఏనుగులను చంపేలా నిర్ణయం తీసుకోవటం ప్రభుత్వ అసమర్థ పాలను నిదర్శనం అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బోట్వాన్సా ప్రభుత్వం ఏనుగుల వేటపై నిషేధం ఎత్తివేయటంతో పాటు అధికారికంగా ఏనుగులను చంపటం కోసం నిర్ణయం తీసుకుంది. ఏనుగుల జనాభా రోజురోజుకు పెరుగుతోందని వేటగాళ్లు ఏనుగులను చంపుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.