హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేతలంతా కేవలం పార్టీ ప్రయోజనాల మీద మాత్రమే దృష్టి సారించి ఐకమత్యంగా కృషి చేస్తే రాబోయే అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్ధ ఆందోళనకరంగా తయారైందన్నారు. అందుకు కేంద్రం కేవలం ఆస్తులను విక్రయిస్తోందని విమర్శించారు. నూతన సాగు చట్టాలు, లఖింపుర్ ఘటన, చైనా చొరబాట్లు, జమ్ముకశ్మీర్‌లో మైనార్టీల హత్యల అంశంలో కూడా కేంద్రంపై వారు మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm