హైదరాబాద్ : సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మారింది. ఫేస్‌బుక్ పేరు మార్చుతున్నట్టు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంచలన ప్రకటన చేశారు. ఫేస్ బుక్ సంస్థ పేరును ఇకపై 'మెటా` గా పిలవనున్నట్టు తెలిపారు. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు 'మెటా` మాతృసంస్థగా ఉండబోతుందన్నారు. కంపెనీ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ప్రస్తుత బ్రాండ్ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాలి. అందుకే మన సంస్థ బ్రాండ్ పేరు మారింది. మెటావర్స్‌లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నాం. వర్చువల్-రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, సంబంధిత అంశాలు మెటావర్స్ పరిధిలోకి వస్తాయి` అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఇకపై కంపెనీ స్టాక్స్ అన్నీ కొత్త సింబల్ MVRSతో ట్రేడ్ అవుతాయని తెలిపారు. MVRS అంటే మెటావర్స్. మెటా వర్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ రియాలిటీ స్పేస్ అని అర్థం. దీనికి సంబంధించిన కొత్తలోగోను కూడా ఆవిష్కరించారు.
గత కొంత కాలంగా ఫేస్‌బుక్ వ్యక్తిగత ప్రయోజనాలు లక్ష్యంగా యూజర్ డేటాను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దాంతో పలు దేశాల్లో ఫేస్‌బుక్ న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటోంది. దీంతో ఫేస్‌బుక్ పేరు తరచుగా వార్తల్లో రావడం యూజర్లపై ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కి చెందిన అన్ని కంపెనీలను ఒకే కొత్త కంపెనీ కిందకు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. అందులోభాగంగానే ఫేస్‌బుక్ పేరును 'మెటా`గా మారుస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఫేస్‌బుక్‌తో పాటు అదే కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్ కొత్త పేరు మెటా. తర్వాతి తరం సోషల్ మీడియా మెటావర్స్‌ను మనకు అందించేందుకు ఈ మెటా సాయపడుతుంది అని ఫేస్‌బుక్ తన ట్వీట్‌లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Oct,2021 07:10AM