హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో 45 రోజుల శిశువును నేలకేసి కొట్టి చంపాడో తండ్రి. ఈ దారుణ ఘటన కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం లైన్‌గూడలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపురావు అనే వ్యక్తి తన భార్యకు కాన్పులో మూడో సారి కూడా ఆడపిల్ల పుట్టిందని.. మద్యం మత్తులో భార్యను చితకబాదాడు. అంతటితో ఆగకుండా నిద్రిస్తున్న 45 రోజుల పసికందును నేలకేసి కొట్టాడు. దాంతో పసికందు మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ మూడోసారి ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో బాపురావు దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. సీసీ రోడ్డుపై పాపను కొట్టడంతో పాటు బండ రాయితో మోదడంతో పాప చనిపోయిందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm