హైదరాబాద్: ప్రభుత్వ అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోశయ్య పార్థివదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. రోశయ్య కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోశయ్య మృతికి ప్రభుత్వం మూడ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm