హైదరాబాద్ : హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని హెచ్సీయూ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, ఓ కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో జూనియర్ ఆర్టిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతులను జూనియర్ ఆర్టిస్టులు మానస, మానస, కారు డ్రైవర్ అబ్దుల్లాగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి సిద్ధు అని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm