హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి రాష్ర్ట హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైరస్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టుని ఆదేశాలు జారీ చేసింది. దీని పై ప్రభుత్వం రెండు రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాలన్న హైకోర్టు సూచించింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాటు చేయలని ధర్మాసనం ఆదేశించింది.