హైదరాబాద్ : తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. పెంచిన ఈ ధరలు ఈనెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ. 50, గరిష్ఠ ధర రూ. 150 గా నిర్ణయించింది. ఇక నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ. 30గా, నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ గరిష్ఠ ధర రూ. 70గా ప్రభుత్వం పేర్కొంది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ కనీస ధర రూ. 100గా, మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో టికెట్ గరిష్ఠ ధర రూ. 250గా, మల్టీప్లెక్స్ రిక్లయినర్ టికెట్ గరిష్ఠ ధర రూ. 300గా నిర్ణయించారు. ఈ ధరలపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. అలాగే ఏసీ థియేటర్లలో టికెట్‌పై రూ.5 నిర్వహణ రుసుం అదనంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Dec,2021 04:26PM