పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని బాత్రూంలో ఓ బాలింత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమా(30) గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలోఈ నెల 12న మగ శిశువు కు జన్మనిచ్చింది. సిజరియన్ చేసిన తర్వాత ఐసియుసిలో ఉంచారు. వారం రోజులకు ఆమెను డిశ్చార్జ్ చేయాల్సి ఉండగా.. శస్త్ర చికిత్స సమయంలో వేసిన కుట్లు మానలేదు. దాంతో మరోసారి కుట్లు వేస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే మరో 3 సార్లు ఉమకు కుట్లు వేసినట్టు తెలిసింది. కుట్లు అతుక్కోపోవడంతో బాధ తట్టుకోలేకే ఆమె ఆస్పత్రిలోని బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Dec,2021 11:23AM